చెన్నైలో ఓ రోగికి శరీరంలో ఐదు కిడ్నీలు..

  0
  55

  వైద్య చరిత్రలో చెన్నైలో ఓ అద్భుతం జరిగింది. ఓ వ్యక్తిని శరీరంలో ఐదు కిడ్నీలతో డిశ్చార్జ్ చేశారు. మనిషికి రెండు కిడ్నీలే కదా.. ఐదంటున్నారు ఏమిటా అని ఆశ్చర్యపోకండి.. ఇదొక ప్రత్యేకమైన కేసు.. చెన్నైకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి బీపీ, షుగర్, గుండెజబ్బుతో బాధ పడుతున్నాడు. అతడికి ఇదివరకే రెండు దఫాలు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. అదుపులో లేని రక్తపోటు వలన రెండు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ఫెయిల్ అయ్యాయి. అంతకుముందే అతడికి మూడు దఫాలు గుండుకు బైపాస్ సర్జరీ జరిగింది. మూడో దఫా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు అతడు సిద్దమయ్యాడు.

  ఇదివరకే ఆయనలో ఉండే రెండు కిడ్నీలు, రెండు దఫాలు ఆపరేషన్ చేసి అమర్చిన రెండు కిడ్నీలు.. ఇప్పుడు తాజాగా ఆపరేషన్ చేసి అమర్చిన కిడ్నీతో కలిపి.. మొత్తంగా ఐదు కిడ్నీలయ్యాయి. ఈ ఐదవ కిడ్నీని లోపల అమర్చేందుకు చోటు లేక వైద్యులు చాలానే శ్రమించాల్సి వచ్చింది. పని చేయని కిడ్నీలను సాధారణంగా తొలగించేస్తారు.. వాటి స్థానంలో కొత్త కిడ్నీని అమరుస్తారు. అయితే ఈ వ్యక్తికి పని చేయని కిడ్నీని తొలగిస్తే విపరీతంగా రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. దానివలన వేరొక వ్యక్తి రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. ఈ రక్తంతో తయారయ్యే యాంటీ బాడీలను కొత్త కిడ్నీ తిరస్కరించే ప్రమాదం ఉంది.

  అందువలన ఆయన ప్రాణానికే ప్రమాదం ఉంది. అందుకే పాత కిడ్నీలను తొలగించలేదు. సాధారణంగా కిడ్నీ అమర్చే స్థానంలో కాకుండా.. కడుపు భాగంలో పేగులకు కుడి వైపున కిడ్నీని అమర్చారు. సాధారణంగా ప్రపంచంలో ఇలాంటి ఆపరేషన్ చేయరని.. తొలిసారిగా తామే చేశామని చెన్నై వైద్యులు ప్రకటించారు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..