స్వంతంగా చేసిన హెలికాఫ్టర్ టెస్టింగ్ ప్రాణం తీసింది..

  0
  412

  3 ఇడియట్స్.. సినిమా చూసి అందులోని హీరోలా సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాడు మహారాష్ట్రకు చెందిన షేక్ ఇస్మాయిల్ అనే యువకుడు.. సొంతంగా హెలికాప్టర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. చదివింది ఎనిమిదో తరగతి మాత్రమే అయినా.. యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ తన ప్రయత్నాన్ని కూడా మొదలుపెట్టాడు. తాను తయారు చేస్తున్న హెలికాఫ్టర్ కు మున్నా అనే పేరును కూడా పెట్టుకున్నాడు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు తాను తయారు చేసిన హెలికాఫ్టర్‌ను ప్రజలకు చూపించాలనుకున్నాడు. ఈ సమయంలోనే విధి వెక్కిరించింది. తాను తయారు చేసిన హెలికాప్టర్ రెక్క గొంతుకు తగిలి.. ప్రాణం విడిచాడు..

  ఇస్మాయిల్‌కు చిన్నప్పటి నుంచి విమానాల్లో ప్రయాణించడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. త్రీ ఇడియట్స్ సినిమా చూసి ఇస్మాయిల్ తానే సొంతంగా ఒక హెలికాప్టర్‌ తయారు చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇబ్రహీం హెలికాప్టర్‌ను పరీక్షిస్తుండగా.. దానిలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా బ్లేడ్‌ తెగింది. ఆ బ్లేడ్ కాస్తా ఇస్మాయిల్ గొంతుకు తగిలింది. దీంతో ఇస్మాయిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కూడా విడిచాడు.

  సొంతంగా తయారు చేసిన హెలికాఫ్టర్ లో ఎగరాలనే కల తీరకుండానే ఇస్మాయిల్ మృతి చెందడం, ఆ గ్రామంలోని వారిని కూడా కంటతడి పెట్టించింది.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..