ఒక్కడే నాలుగు వాక్సిన్ లు కోవిడ్ తో సవాల్..

  0
  217

  ఒకసారి కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునేందుకే జనం ఆపసోపాలు పడుతుంటే, వీడెవడోకానీ రెండు కంపెనీల వ్యాక్సిన్లు నాలుగుసార్లు వేయించుకున్నాడు. ఆస్ట్రాజెనెకా, ఫైజర్ రెండు రకాల వ్యాక్సిన్లు మూడు నెలల్లో రెండు డోసులు పూర్తి చేశాడు. ఇప్పుడు కొవిడ్ కి సంబంధించిన అన్నిరకాల యాంటీబాడీలు తనలో ఉన్నాయని చెబుతున్నాడు. దీనికి ఒక కొత్ పేరు కూడా పెట్టాడు.

  యాంటీబాడీ మిక్సింగ్ అని కాకుండా.. యాంటీబాడీ మ్యాక్సింగ్ అని తన చర్యను సమర్థించుకుంటున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన 34ఏళ్ల టామ్ లీస్ ఇలా టీకాలు వేయించుకున్నాడు. ఇప్పుడు మరో కొత్తరకం డెల్టా వేరియంట్ వైరస్ వచ్చినా, దానికి కూడా వ్యాక్సిన్ వేయించుకుంటానని చెబుతున్నాడు. రెండు రకాల కొవిడ్ వ్యాక్సిన్లు నాలుగు దఫాలు వేయించుకున్నా తనకు ఏమీ కాలేదని తనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాలేదని తెలిపాడు.

  తనకేమీ పనిలేక ఖాళీగా ఉన్నానని, ఖాళీగా ఉంటే ఎక్కువగా తిరుగుతుంటానని, అందువల్ల ముందు జాగ్రత్తగా ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు వేయించేసుకుంటే, రెండు రకాల యాంటీబాడీలు తనలో ఉంటాయనే భావనతోనే ఈ పనిచేశానని అన్నాడు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.