అప్పు తీర్చలేక భార్యను బేరం పెట్టాడు..

  0
  1242

  అప్పుతీర్చడం చేతకాక ఓ భర్త, భార్యను బేరం పెట్టాడు. లక్ష రూపాయలకి అమ్మేశాడు కూడా. నిన్ను ఫలానా వారికి అమ్మేశాను, వారితో వెళ్లిపో అంటూ చెప్పేశాడు. భార్య అందుకు అంగీకరించకపోవడంతో ఆమెపై హత్యాయత్నానికి ఒడిగట్టాడు. చివరకు కటకటాల వెనక్కు వెళ్లాడు.
  ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. గోపాల్ అనే వ్యక్తి ముగ్గురు వడ్డీ వ్యాపారుల వద్ద 50 వేల రూపాయల వరకు అప్పు తీసుకున్నాడు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పాడు. అయితే రోజులు గడుస్తున్నా గోపాల్ అప్పు తిరిగి ఇవ్వలేదు ఈ క్రమంలోనే అప్పు ఇచ్చిన వారి దగ్గర్నుంచి రోజురోజుకీ ఒత్తిడి ఎక్కువైంది. ఇటీవల నీచంగా ఆలోచించాడు గోపాల్. అప్పు తీర్చలేక వారికి తన భార్యని లక్ష రూపాయలకు బేరం పెట్టేసాడు. అంతే కాదు నిన్ను అమ్మేశాను వారితో వెళ్ళిపో అంటు భార్య ముఖం మీద చెప్పాడు దీంతో ఒక్కసారిగా ఆమె షాక్ అయింది. వారితో వెళ్లేందుకు ససేమిరా అంది. ఈ క్రమంలోనే భార్య ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు గోపాల్. చివరికి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది భార్య. పోలీసులు భర్తని అరెస్టు చేశారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.