దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అమ్మాయిల భద్రతకు భరోసా లేదా ? ఈశాన్య రాష్ట్రాల మహిళలు కనిపిస్తే రేట్ ఎంత అని అడుగున్నారు. రాత్రికి వస్తారా ? పడక సుఖం అందిస్తారా ? అని నిలదీస్తున్నారు. ఈ విషయమై ఇన్‌స్టా గ్రామ్‌లో వచ్చిన ఓ వీడియో సంచలనం రేపుతోంది. ఈనెల 19న దీన్ని అప్ లోడ్ చేశారు. ఢిల్లీలోని హస్కాస్ ప్రాంతంలో రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు అమ్మాయిలను వస్తావా ? రేట్ ఎంత ? అని అడుగుతున్న దృశ్యాలు వీడియో కనిపిస్తున్నాయి. అమ్మాయిలు ఆ అడిగిన అబ్బాయిలతో తగాదా వేసుకున్నారు. స్నేహితురాలి ఇంట్లో ఫంక్షన్ కి వెళ్ళి క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న ఆ అమ్మాయిలను సెక్స్ వర్కర్లు అనుకుని ఓ మద్యవయస్కుడు రేట్ ఎంత అని అడిగాడు. ఈ విషయమై వివాదం చెలరేగడంతో అక్కడే ఉన్న మిగతా మగవారు కూడా పారిపోయారు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసి ఫోటోలు కూడా అందించారు. మొదట పోలీస్ స్టేషన్ లో కూడా అధికారి నవ్వి మిన్నకుండిపోయాడని ఆమె ఆరోపించారు. మరో రెస్టారెంట్ లో ఓ పోలీస్, ఈశాన్య రాష్ట్రానికి చెందిన అమ్మాయిని నువ్వు డ్యాన్సర్ వా అని అడిగాడు. కాదు స్టూడెంట్ అని చెప్పింది. అయితే ఆ పోలీస్ ఆ అమ్మాయిని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుండడంతో ఆమె వీడియో తీయబోయే, అక్కడి నుంచి పరారయ్యాడు. వీడియో చూడండి..
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?