డిస్కౌంట్ ఆఫర్ లో మోసం-36 లక్షల ఫైన్ .

  0
  188

  చిన్న‌పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్ట‌మంటారు. అలాగే చిన్న త‌ప్పుకైనా పెద్ద శిక్ష వేస్తే దారిలోకి వ‌స్తారు. అలాంటి ఘ‌ట‌నే అమెరికాలోని పెన్సిల్ వేనియా ప్రాంతంలో జ‌రిగింది. ఓ దొంగ చేసే చిన్న చిన్న త‌ప్పుల‌కు ఇప్పుడు పెద్ద శిక్ష అనుభ‌విస్తున్నాడు. జోస‌ఫ్ సొబోస్కీ అనే వ్య‌క్తి ఓ కూల్ డ్రింక్ షాపులోకి వెళ్ళాడు. అక్క‌డ రెండు కూల్ డ్రింక్ బాటిల్స్ మూడు డాల‌ర్స్ అని రాసి ఉంది. అయితే సొబోస్కీ మాత్రం మూడు డ్రింక్ బాటిల్స్ తీసుకుని రెండు డాల‌ర్లే ఇచ్చాడు.

  దీన్ని గుర్తించిన క్యాషియ‌ర్‌, అత‌న్ని ఆపి డ‌బ్బులు చెల్లించాల‌ని డిమాండ్ చేయ‌డంతో, ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. మొత్తానికి సొబోస్కీ మాత్రం మూడు డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్ళిపోయాడు. దీంతో అత‌ని మీద కేసు న‌మోదైంది. కోర్టులో కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. సోబోస్కీకి 36 ల‌క్ష‌ల రూపాయ‌ల ఫైన్ విధించ‌డంతో పాటు ఏడేళ్ళ జైలుశిక్ష విధించింది. గ‌తంలో సొబోస్కీ కారుకి గ్యాస్ ప‌ట్టించుకుని డ‌బ్బులు చెల్లించ‌కుండా పోయాడు. చెప్పుల దుకాణంలోకి వెళ్ళి స్లిప్ప‌ర్స్ చోరీ చేశాడు. అప్పుడు కూడా ఇలాగే జైలుకి వెళ్ళొచ్చాడు. అత‌నికి బుద్ది రాక‌పోవ‌డంతో… ఈసారి జైలుశిక్ష‌తో పాటు భారీ జ‌రిమానా విధించింది న్యాయ‌స్థానం.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.