పగబట్టిన నిర్మల తల శత్రువు ఇంటి గుమ్మానికి.

    0
    6033

    ఫ్యాక్ష‌నిజం… ఎప్పుడు పుట్టిందో… ఎక్క‌డ పుట్టిందో తెలియ‌దు… దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇది వేనూళ్ళుకుపోయింది. దీనివ‌ల్ల ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్న‌మ‌య్యాయి. అయినా ప‌గ‌… ప‌గ‌… అంటూ ఫ్యాక్ష‌న్ దూలాలు ప‌ట్టుకుని వేలాడుతున్న వారూ లేక‌పోలేదు. అలాంటి ఘ‌ట‌నే ఇది కూడా. త‌మిళ‌నాడు రాష్ట్రం దిండిగ‌ల్ లో రెండు కుటుంబాల మ‌ధ్య నెల‌కొన్న‌ ఫ్యాక్ష‌నిజం వ‌ల్ల‌ న‌ర‌మేధం కొన‌సాగుతోంది. మూడు ద‌శాబ్దాల‌కు పైగా ఈ రెండు కుటుంబాల మ‌ధ్య వైరం ఉంది. 1990లో రెండు కుటుంబాల మ‌ధ్య మొద‌లైన వైరం.. ఫ్యాక్ష‌న్ వైపు అడుగులు వేసింది. అప్పుడు తెగిప‌డిన త‌ల‌… ఇప్ప‌టికీ ఎన్నో త‌ల‌ల‌ను బ‌లి తీసుకుంది. ఆ వివ‌రాల్లోకి వెళితే…

    1990 సంవ‌త్స‌రంలో శివ‌సుబ్ర‌మ‌ణ్యం అనే వ్య‌క్తిని ప్ర‌త్య‌ర్ధి వ‌ర్గంలోని ప‌శుప‌తి పాండియ‌న్ చంపాడు. 1993లో అత‌ని కుమారుడు కూడా ప‌శుప‌తి చేతిలో హ‌త‌మ‌య్యాడు. 2006లో ప‌శుప‌తి భార్య‌ని శివ‌సుబ్ర‌మ‌ణ్యం వ‌ర్గం హ‌త‌మార్చింది. ఇక 2012లో నిర్మ‌లాదేవి అనే మ‌హిళ‌… త‌న అనుచ‌రులైన 18 మందితో క‌లిసి ప‌శుప‌తి ఇంటిపై దాడి చేసి చంపింది. అత‌ని త‌ల‌ను ఆ ఇంటి గుమ్మానికి వేలాడ‌దీసింది. అప్పుడు ప‌శుప‌తి కుటుంబీకులు శ‌ప‌ధం చేశారు.

    ఏనాటికైనా ఆమె త‌ల‌ను ఇదే ఇంటి దూలానికి వేలాడ‌దీస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. ఇక 2016లో ప‌శుప‌తి కుటుంబంలోని సుభాష్ ని చంపారు. 2017లో ప‌శుప‌తి ప్ర‌ధాన అనుచ‌రుడు సింగారాంని కూడా ప్ర‌త్య‌ర్ధి వ‌ర్గం చంపేసింది. ఆ ర్వాత మ‌రో న‌లుగురు ఈ ఫ్యాక్ష‌నిజానికి బ‌ల‌య్యారు. కాగా ప‌శుప‌తిని చంపిన నిర్మలాదేవిని ఇటీవ‌ల చంపారు ప‌శుప‌తి కుటుంబీకులు. ఆమె త‌ల న‌రికి ప‌శుప‌తి ఇంట్లో వేలాడ‌దీశారు. ఆమెతో పాటు స్టీఫెన్ రాజ్ ను కూడా న‌రికేశారు. దాదాపు 9 ఏళ్ళ త‌ర్వాత నిర్మాలాదేవిని న‌రికేసి త‌మ‌ శ‌ప‌ధం నెర‌వేర్చుకున్నారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.