ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్స్ .. తనకు ఇష్టంలేని అధికారులను, శిక్షించడంలో కిమ్ కు రాక్షసుడిగా పేరు.. ఉత్తరకొరియా చుట్టూ ఇనుప తెరలు దించేసిన నాయకుడు.. తమ దేశంలో ఏం జరుగుతుందో కూడా బయటకు తెలియనివ్వని వ్యక్తి కిమ్.. అలాంటి పరమ కిరాతకుడైన నియంత కన్నా ఆమె చెల్లెలే మహా ప్రమాదకారి.. చెల్లితో పోల్చితే కిమ్ చాలా మెరుగని అంటుంటారు. 2014లో ఆమెను అన్నయ్య కిమ్.. పదవి ఇచ్చి.. రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. తన అన్నపై ప్రజల అభిమానం పెంచే విధంగా.. ఆయనను అందరూ వ్యక్తిగతంగా ఆరాధించేలా ప్రభుత్వ పధకాలను రూపొందించేది.
ఆయన రాజకీయ నాయకత్వాన్ని పటిష్టం చేసేలా ప్రచార కార్యక్రమాలను కూడా రూపొందించేది. ఆ తర్వాత 2017లో పొలిటికల్ పొలిట్ బ్యూరో మెంబెర్ కూడా అయింది. ఆ తర్వాత 2019 లో అత్యున్నత అసెంబ్లీకి ఎంపికైంది. అన్న కంటే కఠినంగా శిక్షలను కూడా అమలుచేస్తుంది. ఒకరకంగా ఆమెను పిచ్చిదానిగా కూడా పిలుస్తారు. పక్కనే ఉండే శత్రుదేశమైన దక్షిణ కొరియాను సర్వనాశనం చేస్తానని.. నేలమట్టం చేస్తానని కూడా బహిరంగంగా ప్రకటించింది..
ఇటీవల కొంతకాలం అనారోగ్యంతో అజ్ఞాతంలో వున్నప్పుడు ఆమె దేశ వ్యవహారాలను కూడా నడిపించింది. కిమ్ కు విశ్వాస పాత్రులైన, నాయకులు, అధికారులు కూడా ఆమెను చూస్తే చాలు, వణికిపోతారు. ఒక అధికారి తనతో మాట్లాడేటప్పుడు చేతులు ఊపాడని.. ఒక దఫా అతని చేతులకు బేడీలు వేయించి.. తిండి లేకుండా నడివీధిలోనే ఐదురోజుల పాటూ నిలబెట్టింది. కనీసం బాత్ రూమ్ కు వెళ్లేందుకు కూడా అనుమతించలేదు.
మరొక సమావేశంలో తాను లేచి నిలబడుతున్నప్పుడు వృద్ధుడైన ఓ అధికారి లేయడం ఆలస్యమైన కారణంగా.. అతడిని జీవితాంతం జైల్లో ఉండాలని ఆదేశించింది. చెల్లి మాటలను కిమ్ అస్సలు కాదనలేదు.. ఉత్తరకొరియాకు కోబోయే అధ్యక్షురాలు కూడా ఆమె.. ఉత్తరకొరియాను ప్రపంచంతో సంభంధం లేకుండా పాలించాలంటే.. ఇంత కిరాతకత్వం అవసరమనేది కిమ్ ఆలోచన.. అందుకే తనకంటే కిరాతకురాలైన చెల్లిని ఉత్తరకొరియా భవిష్యత్తు నేతగా కూడా నిర్ణయించాడు కిమ్..
ఇవీ చదవండి..