ఉత్తరప్రదేశ్ లో ఓ భర్త తన భార్య నుంచి విడాకులు కోరాడు. అందుకు అతను చెప్పే కారణం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. తన భార్య స్నానం చేయడం లేదని, అందుకే విడాకులు ఇస్తున్నానని ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. ఆమె స్నానం చేయకపోవడం వల్ల ఆమెతో సరిగా ఉండలేకపోతున్నానని, కనీసం పడక గదిలో కూడా పడుకోలేకపోతున్నానని చెప్పాడు.
ఆమె ఒంటి నుంచి దుర్వాసన వస్తోందని, కలిసి కాపురం చేయలేనని తెగేసి చెప్పాడు. దీంతో ఆ వివాహిత ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ లో భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో ఇరువురిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. భర్త తన ఆవేదనను చెప్పుకున్నాడు. ఆ తర్వాత భార్య తన గోడును వెళ్ళబోసుకుంది. తాను ప్రతి రోజూ స్నానం చేయలేనని, అది తనవల్ల కాదని తేల్చిచెప్పింది. భర్త మాత్రం కావాలని, అతనితోనే ఉంటానని చెప్పింది. దీంతో ఏం చేయాలో తెలియక, వారం రోజుల గడువు ఇచ్చి, ఇద్దరినీ ఇంటికి పంపించారు అధికారులు. యూపీలోని అలీఘర్ లో ఈ విచిత్ర ఘటన జరిగింది.
ఇవీ చదవండి..