లాయర్ల వేషంలో వచ్చి కోర్టులోనే చంపేశారు..

  0
  909

  ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలోనే భయంకరమైన నేరస్తుడిని ప్రత్యర్థులు కాల్చి చంపేశారు. లాయర్ల వేషంలో వచ్చి , కోర్టు లో ఉన్న జితేంద్ర అనే మాఫియా నేతను కాల్చి చంపేశారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురు చనిపోయారు. లాయర్ల మాదిరి డ్రెస్ తో వచ్చిన దుండగులు దాదాపు 40 రౌండ్లు కాల్పులు జరిపారు. కోర్టులోని జితేంద్ర చనిపోయాడు.

  ముంబై కి చెందిన జితేంద్ర 19 హత్య కేసుల్లో నిందితుడు. ఢిల్లీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. 21 ఏళ్ళ వయసులోనే తండ్రి మరణం తరువాత జితేంద్ర హత్యలు చేసి , తనకంటూ ఒక గ్యాంగ్ ను తయారు చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ దండాలు , కిడ్నాపులు , బ్లాక్ మెయిలింగ్ , హత్యలు ..ఇలా అనేక నేరాలతో తనకంటూ ఒక గ్యాంగ్ ఏర్పాటైంది. ఢిల్లీలో కూడా నాలుగు హత్యలు చేసాడు. ఇతడిని పట్టిస్తే 4 లక్షల రివార్డ్ కూడా ఉండేది. ప్రస్తుతం ఢిల్లీ జైల్లోనే ఉన్న జితేంద్రను కోర్టుకు తీసుకొచ్చిన తరువాత , కాల్పులు జరిపి చంపేశారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.