వామ్మో ..వాడే , వీడు , వీడే వాడు.. హలో బ్రదర్ ..

  0
  28

  నాగార్జున నటించిన హలో బ్రదర్ , బాలకృష్ణ రాముడు – భీముడు సినిమాల్లో ఒకే పోలికలతో ఉన్న కవలల లవ్ స్టోరీ తెలుసుకదా..? అంతకన్నా బాగా , ఓ ప్రబుద్దుడు కథలల్లి అమ్మాయిని బుట్టలోవేసుకొని , డబ్బులుకొట్టేసి పరారీలో ఉన్నాడు. చెన్నైలో రేయాన్ అనే యువకుడు ఒక కంపెనీలో తనతో పనిచేసే 21 ఏళ్ళ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళికి ప్రపోజ్ చేశాడు. అయితే రేయాన్ కి ఇదివరకే పెళ్లయింది. పిల్లలున్నారు. ఈ విషయం దాచిపెట్టాడు. ఓ ఫ్రెండ్ అమ్మాయికి ఈ విషయం చెప్పాడు. అయితే , తనకు , తనలాంటి కవల సోదరుడు ఉన్నాడని , అతడు దుబాయిలో ఉంటాడని ట్విస్ట్ ఇచ్చాడు. వాడికి పెళ్లయిందని , వాడి భార్యకూడా ఒక్కోసారి తనను చూసి , వాడే అనుకుంటుందని కథ అల్లాడు. దీంతో పాపం అమ్మాయి నిజమని నమ్మింది. తన పెళ్ళిపోటోలనే , తన కవల సోదరుడి పెళ్లి ఫొటోలుగా చూపించాడు.. అలా బుట్టలో వేసి మూడున్నర లక్షలు కట్నంగా కొట్టేశాడు. తర్వాత , మరో వ్యక్తికూడా ఈ విషయం తెలిసి , రేయాన్ కి ఇదివరకే పెళ్లయిందని , కవల సోదరుడు ఉన్న మాట నిజంకాదని చెప్పాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. రేయాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు..

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..