కారుతో సహా నిప్పంటించుకుని ప్రేమికుల ఆత్మహత్య

  0
  29

  పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడే ప్రేమికుల్ని చాలామందినే చూసి ఉంటాం. అయితే ఈ ప్రేమికులు మాత్రం తమ చావుకి, తమ ప్రేమ చిగురించడానికి కారణమైన కారునే వేదికగా చేసుకున్నారు. ఆ కారు వల్లే వారి చూపులు కలిశాయి. ఓ సారి కారులో లిఫ్ట్ ఇచ్చే సందర్భంలో పరిచయమైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడా ప్రేమికులే తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కర్నాటకలోని చామరాజనగర జిల్లా కొళ్లేగాల తాలూకా తేరంబళ్లి చెరువు వద్ద జరిగింది. ప్రేమికులను మాంబళ్లికి చెందిన కాంచన (20), శ్రీనివాస్‌ (26)గా గుర్తించారు. కారులోనే కూర్చొని కిరొసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నారని అనుమానిస్తున్నారు. వారి శరీరాలు కాలి బూడిదగా మారాయి. మాంబళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..