ఆన్ లైన్ లో సెకండ్ హ్యాండ్ ఫ్రిజ్ కొన్నాడు ఓ కస్టమర్. దాన్ని ఇంటికి తెచ్చి వాడుతున్నాడు. ఒకరోజు దాన్ని నీట్ గా శుభ్రం చేయబోయాడు. ఫ్రిజ్ కిందిభాగంలో ప్లాస్టిక్ కవర్ తగిలే సరికి దాన్ని బయటకు తీశాడు. షాకై కిందపడిపోయాడు. ఆ కవర్లో 96లక్షల రూపాయలు కనిపించాయి. ఈ ఘటన దక్షిణ కొరియాలోని జెజు ఐలాండ్ లో జరిగింది.
అయితే ఆ కస్టమర్ డబ్బులు తీసుకుని పండగ చేసుకోలేదు. ఫ్రీగా వచ్చిన సొమ్మే కదా అని ఎంజాయ్ చేయలేదు. బాధ్యతగా దాన్ని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు. ఈ వ్యవహారం ఇప్పుడు దక్షిణ కొరియాలోనే సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది.