మంత్రికి చలానా రాస్తే ఏమవుతుందో తెలుసా..?

    0
    165

    ఏయ్ నేనెవరో తెలుసా.. నా కారునే అడ్డుకుంటావా, నా కారుకే చలానా వేస్తావా అంటూ రెచ్చిపోయే రాజకీయ నాయకుల్ని చాలామందినే చూసుంటాం. కానీ తెలంగాణ మంత్రి కేటీఆర్ స్టైలే వేరు. ఆయన కారుకి చలానా రాసిన పోలీసుల్ని పిలిచి మరీ సన్మానించారు. వారి నిజాయితీని, నిబద్ధతను మెచ్చుకున్నారు. రాంగ్ రూట్ లో వచ్చినందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కారుకి పోలీసులు చలానా విధంచారు.

    ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని.. చలాన్ విధించిన రోజు తాను వాహనంలో లేనని కేటీఆర్‌ స్పష్టం చేశారు. లంగర్‌ హౌస్‌ సంగం సమీపంలో బాపూఘాట్‌ లో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్‌లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్‌ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు శాలువా కప్పి అభినందించారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకి ఎప్పుడూ తాము అండగా ఉంటామని చెప్పారు. మంత్రి కేటీఆర్ తన వాహనానికి విధించిన చలాన్ సైతం చెల్లించారు. ఈ విషయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు కూడా సరైన సందేశం ఇచ్చారు. చలానా వేసిన ట్రాఫిక్ సిబ్బందిని తాను అభినందించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తమ పార్టీ నేతలు కూడా ఇలా ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు.

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.