కోటీశ్వరుడి ఇంట్లో కుక్కకదా..? దాని స్టయిల్ అంతే.

  0
  200

  కోటీశ్వ‌రుడి ఇంట్లో పెరిగే కుక్క లైఫ్ స్ట‌యిల్ కూడా రాయ‌ల్టీగానే ఉంటుంది. రెండు రోజుల క్రితం ఓ కుక్క ముంబై నుంచి చెన్నైకి ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ లో ప్ర‌యాణం చేసింది. గ‌తంలో పెంపుడు కుక్క‌ల‌ను విమానంలో తీసుకెళ్ళ‌డం కొత్తేమీ కాక‌పోయినా, ముంబై నుంచి చెన్నైకి ప్ర‌యాణం చేసిన ఓ కోటీశ్వ‌రుడు మూడు ల‌క్ష‌లు పెట్టి త‌నకోసం, త‌న కుక్క కోసం మొత్తం బిజినెస్ క్లాస్ అంతా బుక్ చేసుకున్నాడు. ఆ ఎయిర్ ఇండియా ఏ320 విమానంలో జే బిజినెస్ క్లాస్ లో 12 సీట్లు ఉంటాయి. ఆ 12 సీట్లు బుక్ చేశాడు. ఎయిర్ ఇండియా నిబంధ‌న‌ల ప్ర‌కారం పెంపుడు కుక్క‌లు, పిల్ల‌లు, ప‌క్షుల‌ను అనుమ‌తిస్తారు. అయితే వాటి ఆరోగ్యం, ర్యాబిస్ వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికేట్ చూపించాల్సి వుంటుంది. ఆ జంతువు బ‌రువును బ‌ట్టి రెండు పెంపుడు జంతువుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు. ఇటీవ‌ల బ్రిట‌న్ లో కూడా ఓ చిన్న పెంపుడు కంగారుని విమానంలో తీసుకొచ్చి సంచ‌ల‌నం సృష్టించారు. ఇప్పుడు మ‌న దేశంలో ఏకంగా పెంపుడు కుక్క కోసం ఏకంగా బిజినెస్ క్లాస్ నే బుక్ చేసిన వార్త వైర‌ల్ అయింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.