కారు స్టిక్కర్లపై హైకోర్టు కీలక ఆంక్షలు..

    0
    691

    కారు కొన్న వెంటనే అదనపు హంగులతోపాటు.. వెంటనే ఎండ పడకుండా అద్దాలకు బ్లాక్ కలర్ ఫిల్మ్ ని అతికించేస్తుంటారు చాలామంది. అయితే అలా కలర్ ఫిల్మ్ లు అతికించడం చట్ట విరుద్ధం. కారులో ఏం జరుగుతుందో, ఎవరు ఉన్నారో, ఎవరిని తీసుకెళ్తున్నారో క్లియర్ గా బయటికి తెలియాలి. కానీ చాలామంది ఈ నిబంధనను పాటించరు. ఇకపై అలా చేయడానికి వీళ్లేదు. ఒకవేళ మీ కారు అద్దాలకు బ్లాక్ కలర్ ఫిల్మ్ ఉంటే మాత్రం వెంటనే దాన్ని తీసేయండి. లేకపోతే తమిళనాడు పోలీసులు నిర్దాక్షిణ్యంగా కారు ఆపేస్తారు, ఫిల్మ్ తీసేస్తారు. అదనంగా జరిమానా విధిస్తారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

    కార్ల అద్దాలపై ఉన్న బ్లాక్ ఫిల్మ్ పేపర్ తీసేయాలని మద్రాస్ హైకోర్టు 2 నెలలు టైమ్ ఇచ్చింది. కేవలం బ్లాక్ ఫిల్మ్ మాత్రమే కాదు. కార్లపై పార్టీ జెండాలు కూడా ఉండకూడదు. కారు నెంబర్ ప్లేట్లపై పార్టీ సింబల్స్, డిజిగ్నేషన్ బోర్డ్ లు ఉండకూడదు.

    మతపరమైన, నాయకుల బొమ్మలు, ప్రెస్, అడ్వొకేట్, డాక్టర్ అంటూ రాసిన స్టిక్కర్స్ కూడా కనిపించడానికి వీల్లేదు. దీనిపై ఓ వ్యక్తి పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ దాఖలు చేయగా జస్టిస్ కిరుబకరన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తమిళనాడులోనే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా 50శాతం వాహనాలు ఇదే తరహాలో ఉన్నాయని, వాటన్నిటినీ మార్చేయాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు కిరుబకరన్. నెంబర్ ప్లేట్లు అన్నీ రవాణా శాఖ సూచించిన విధంగానే ఉండాలని ఆదేశాలిచ్చారు.

    కార్లకు అవసరానికి మించి ఎల్ ఈడీ లైట్లను బిగించడం కూడా తప్పని సూచించారు. కార్లతోపాటు కంపెనీ వారు ఇచ్చే లైటింగ్ వ్యవస్థనే వాడాలని, ఎల్ఈడీ లైట్లతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. అలాంటి వాహనాల యజమానులకు 2 నెలలు సమయం ఇచ్చి, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించారు. కార్లను ఫలానా వారు గిఫ్ట్ గా ఇచ్చారంటూ కొటేషన్లు రాసినా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.