కోహ్లీ కారు సొంతం చేసుకునే అదృష్టవంతులెవరో..?

  0
  519

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యంత ఖరీదైన తన లాంబోర్గిని కారుని అమ్మేస్తున్నాడు. ప్రస్తుతం ఆ కారు కొచ్చిలోని ఓ షోరూమ్ లో ఉంది. ఎన్నో ఖరీదైన కార్లను తనతోనే ఉంచుకున్న కోహ్లీ ఈ కారుని మాత్రం అమ్మకానికి పెట్టాడు. ఈ కారుని కోహ్లీ 2015లో కొనుగోలు చేశాడు.

  కోహ్లీ వాడిన ఆరెంజ్ కలర్ లాంబోర్గిని గల్లార్డో స్పైడర్ ప్రస్తుతం కొచ్చిలో ఉంది. ఓ లగ్జరీ కార్ షోరూమ్‌ లో అమ్మకానికి అందుబాటులో ఉంది. స్పోర్ట్స్ కార్లను బాగా ఇష్టపడే విరాట్ కోహ్లీ వాడిన కారు మీకు కావాలంటే మీరూ దాన్ని సొంతం చేసుకోవచ్చు. ధర కేవలం కోటీ 35లక్షలు మాత్రమే.

  ఇది 2013 మోడల్ లాంబోర్గినీ కారు. విరాట్ కోహ్లీ చాలా తక్కువ కాలమే దీన్ని ఉపయోగించాడు. ఇద్దరి చేతులు మారి 2015లో ఇది విరాట్ దగ్గరకు చేరింది. ఇది కేవలం 10,000 కిమీ మాత్రమే నడిచిందని రాయల్ డ్రైవ్‌ మార్కెటింగ్ మేనేజర్ చెబుతున్నారు. ఆ షోరూమ్ నిర్వాహకులు ఈ కారుని కోల్‌ కతాకు చెందిన ప్రీమియం, లగ్జరీ ప్రిఓన్డ్ కార్ డీలర్ నుంచి జనవరి 2021 లో కొనుగోలు చేశారట. ప్రస్తుతం దీన్ని వీరు తిరిగి అమ్మేస్తున్నారు.

  ఈ మోడల్ విశిష్టతలు ఇవీ..
  ఈ మోడల్‌ ను LP560-4 అని కూడా అంటారు. ఇది 5.2-లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ V10 ఇంజిన్‌ తో నడుస్తుంది. ఈ కారు కేవలం నాలుగు సెకన్లలో జీరో నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 324 కిలోమీటర్లు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.