సహజీవనంతో పెళ్ళి పవిత్రతకు కళంకం.

  0
  65

  సహజీవనంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహ వ్యవస్థకు సహజీవనం ఒక గొడ్డలి పెట్టులా తయారైందని పేర్కొంది. పెళ్లి అనే పదానికి సహజీవనం కళంకం తెచ్చిపెట్టేదిలా ఉందని, దీనివల్ల వివాహ బంధం పవిత్రతకు భంగం వాటిల్లుతోందని పేర్కొంది. ఆడ, మగ చట్టబద్ధంగా పెళ్లిళ్లు చేసుకోకుండా సహజీవనం పేరుతో కలసి ఉండటం, బిడ్డల్ని కనడం సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకం అని కూడా అభిప్రాయ పడింది.

  గృహహింస నిరోధక చట్టంలో సహజీవనం వల్ల జరిగే సంఘటనలను కూడా ఆ చట్టం కిందకు తీసుకు రావడానికి హైకోర్టు తప్పుబట్టింది. ఇటీవల పంజాబ్-చండీఘడ్ హైకోర్టు సహజీవనానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు కూడా అదే స్థాయిలో విరుచుకుపడింది. వివాహ వ్యవస్థలో నైతికత, ధర్మం, శాస్త్రం, పవిత్రత, ముఖ్యమైనవని, వాటికి భంగం కలిగించే ఎటువంటి చర్యనైనా వ్యతిరేకించాలని పేర్కొంది. సాంప్రదాయం న్యాయ వ్యవస్థలో ఒక భాగంగా ఉండాలని, అలా ఉండగలిగిన నాడే చట్టానికి విలువ ఉంటుందని కూడా న్తాయమూర్తులు వ్యాఖ్యానించారు.

  తన భర్తకి వ్యతిరేకంగా ఓ భార్య గృహహింస నిరోధక చట్టం కింద పెట్టిన కేసుకి సంబందించి జస్టిస్ ఎస్ వైద్యనాధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుని బట్టి చూస్తే భార్యే భర్తను వేధిస్తున్నట్టు కనిపిస్తోందని, దురదృష్టవశాత్తు భార్యల చేతిలో హింసను అనుభవిస్తున్న భర్తలకు గృహహింస నిరోధక చట్టం కింద కేసులు పెట్టే అవకాశం లేకుండా పోయిందని, వారికి ఈ చట్టం వర్తించడంలేదని అన్నారు. తనకు విడాకులు మంజూరవుతున్నాయని తెలిసి కూడా భార్య, ఆ భర్తను హింసించడం మానసికమైన క్షోభకు గురిచేయడం ధర్మసమ్మతం కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగానే ఆయన సహజీవనంపై వ్యాఖ్యలు చేశారు. భార్యా భర్తల మధ్య అసహనం, స్వాభిమానం కాలికి వేసే చెప్పులలాంటివని, అవి ఇంటిబయటే ఉండాలని, అలాగే కాపురాల్లో కూడా అవి భార్యా భర్తల మధ్య ఉండకూడదని అన్నారు. ఇవి భార్యా భర్తల దాంపత్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని వ్యాఖ్యానించారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..