ఆకాశంలో ఈత‌ కొట్టాల‌ని ఉందా.?

    0
    51

    ఆకాశంలో ఈత‌ కొట్టాల‌ని ఉందా… అయితే లండ‌న్ కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆకాశంలో రెండు బ‌హుళ అంత‌స్థుల మ‌ధ్య వారిధిలా పెద్ద స్విమ్మింగ్ ఫూల్ క‌ట్టారు. వంద అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. అందుకే దీనికి స్కై పూల్ అని పేరు పెట్టారు. ఈ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుంటే.. ఆకాశంలో ఈదుతున్నట్లే ఉంటుంది. ఇది పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. గాజు గ్లాసుతో క‌ట్ట‌డం వ‌ల్ల స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ, కింద ఉండే జనాలను చూడవచ్చు. అలాగే, కింద నడిచే వాళ్లకు పైన స్కైపూల్‌లో ఈత కొట్టేవాళ్లు కూడా కనిపిస్తారు. ఇలాంటి స్కై స్విమ్మింగ్ ఫూల్ ను నిర్మించ‌డం ప్ర‌పంచంలో ఇదే తొలిసారి. కాగా ఈ స్కై పూల్ లండ‌న్ లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..