కుటుంబాన్ని తుడిచిపెట్టిన కరోనా..

    0
    51

    భారత్ లో కరోనా కాటుకి దాదాపు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులనో, బంధువులనో, బాగా తెలిసినవారినో కోల్పోయారు. కానీ ఉత్తర ప్రదేశ్ లోని ఓ కుటుంబం మొత్తం కరోనాకు తుడిచిపెట్టుకు పోయింది. 9మంది కలసి నివశించే ఆ కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక్కడు మిగిలాడు. ఆ ఎనిమిది మందికి అతడే అంత్యక్రియలు చేశాడు.
    ఉత్తర ప్రదేశ్ లోని ఇమాలియా అనే గ్రామంలో ఏప్రిల్ 25నుంచి నెలరోజలు వ్యవధిలో 8మంది కరోనాతో చనిపోయారు. నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు, వారి తల్లి.. ఇలా అందరూ కరోనాతో చనిపోయారు. వారి తర్వాత ఆ పిల్లల మేనత్త కూడా కరోనాకి బలైంది. వీరందరికీ కుటుంబ పెద్దగా ఉన్న ఓంకార్ యాదవ్ అంత్యక్రియలు నిర్వహించాడు. ఉదయం తల్లికి తలకొరివి పెట్టిన ఓంకార్ యాదవ్.. సాయంత్రం నలుగురు తమ్ముళ్లకు అంత్యక్రియలు నిర్వహించాడు. వారం రోజుల వ్యవధిలో తన ఇద్దరు చెల్లెల్లకి కూడా అంత్య క్రియలు చేశాడు. మేనత్త అంత్య క్రియల్లో పాల్గొన్నాడు. గత సోమవారం రోజు అందరికీ కర్మక్రతువులు చేశాడు. చివరికి ఆ కుటుంబంలో అతనొక్కడే మిగిలిపోయాడు.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..