వరదల్లో సాయం చేయడానికి వెళ్లి..

    0
    36

    వానలు, వరదలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు సాయం చేయడానికి వెళ్తుంటారు. కొంతమంది మందీ మార్బలాన్ని పక్కనపెట్టి తామే నేరుగా రంగంలోకి దిగుతారు. అయితే కొన్నిసార్లు వారికి చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి. అలానే జరిగింది మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రాకి. దతియా జిల్లాలో వరదలు రావడంతో ఆయన సహాయ కార్యక్రమాలకోసం వెళ్లాడు. పడవలో లైఫ్ జాకెట్ తో నేరుగా బాధితుల దగ్గరకు వెళ్లి సాయం చేయాలనుకున్నాడాయన. అయితే అక్కడే చిన్న సమస్య వచ్చింది.

    నరోత్తమ్ వెళ్లే దారిలో వరదనీటి ప్రవాహం ఎక్కువైంది. దీంతో ఊరిలోకి వెళ్లకుండానే పక్కనే ఉన్న ఓ డాబాపైకి ఎక్కారాయన. వెంటనే ఆ సమాచారం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి వెళ్లింది. ఇంకేముంది వారు హెలికాప్టర్ వేసుకుని మినిస్టర్ కోసం వచ్చేశారు. మినిస్టర్ ని ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడినుంచి వెంటనే తరలించారు.

    ఇవీ చదవండి..

    కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

    ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

    అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

    తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.