నా భార్య కళ్లలో ఆనందంకోసం చనిపోతున్నా..

  0
  8874

  చిత్తూరు జిల్లా మదనప్లలిలో ఓ భర్త భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకునే ముందు వీడియోలో తన బాధను రికార్డ్ చేసి , లైవ్ లోనే , ఉరి బిగించుకొని చనిపోయాడు. భార్య, అత్త, ఆమె కుమార్తెలు పెడుతున్న వేధింపులు తాళలేక భార్య , ఆమె చెల్లెళ్ళు , అత్త , మామ కోరికమేరకు తాను చనిపోతున్నానని చెప్పాడు. గుంటూరుకు చెందిన శంకర్ నారాయణ కుమారుడు ఉదయ్ భాస్కర్కి ఆరేళ్ల క్రితం మదనపల్లెకు చెందిన సోనీతో వివాహమైంది.

  వీరికి ఒక కుమార్తె ఉంది. ఉదయ్ భాస్కర్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబ విషయమై తరచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సోనీ పుట్టిం టికి వెళ్లింది. ఉదయ భాస్కర్ తన భార్య, ఆమె తల్లి, భార్య చెల్లెల్లు పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక ఫేస్బుక్ లైవ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫేస్ బుక్ లో ఈ విషయాన్ని గుర్తించిన కొంతమంది స్నేహితులు బాధితుడి కుటుంబ సభ్యులకు, పోలీసు లకు సమాచారమిచ్చారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.