మరో 20 రోజులోనే జగన్ కొత్త మంత్రివర్గం.. ?

    0
    921

    రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం అక్టోబర్ 15 – 20 తేదీల మధ్యలో కొలువుతీరనుందని చెబుతున్నారు. మొదట జనవరి నెలలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు జరుగుతుందని ప్రచారమున్నా ,అది మరో 20 రోజులలో కార్యరూపం దాల్చనుందని చెబుతున్నారు. ఈ దఫా మంత్రివర్గం ఎన్నికల మంత్రివర్గంగానే ఉండబోతుంది. అంటే , పనిచేసే మంత్రులు , చేసే పనిని ప్రజల్లోకి తీసుకుపోయే మంత్రులు , సంక్షేమ పధకాలను సమర్థవంతంగా అమలు చేసే మంత్రుల టీమ్ ని ఏర్పాటుచేయబోతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వపనితీరు , సంక్షేమ పధకాల అమలుతీరుపై సర్వే చేసి , ఒక అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుత మంత్రుల పనితీరు , వారిపై ఆరోపణలపై కూడా ముఖ్యమంత్రి సమగ్ర నివేదిక తెప్పించుకున్నారు.

    రెండున్నరేళ్లకే ప్రజల్లో రేటింగ్ పడిపోయిన ఎమ్మెల్యేల నివేదికలుకూడా ఉన్నాయి.. వీటన్నింటి ఆధారంగానే మంత్రివర్గం కూర్పు ఉండబోతుంది.ఇదిలా ఉండగా కొత్త మంత్రివర్గం కొలువుదీరే ముందు , ఉన్న మంత్రుల నుంచి రాజీనామా కోరాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే , కొంతమంది సీనియర్ మంత్రులే , రాజీనామాలు ఇస్తారని చెబుతున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్తీకరణకు ముఖ్యమంత్రికి స్వేచ్ఛ ఇస్తున్నట్టు పేర్కొంటూ ముందుగా రాజీనామాలు ఇస్తారని , మిగిలినవారుకూడా వారినే అనుసరించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. దీనికి నాందీ ప్రస్తావనగా , మంత్రి బాలినేని ముందుగా ఫీలర్ కూడా వదిలేశారు. ముఖ్యమంత్రి , మంత్రులందరినీ మార్చబోతున్నారని చెప్పారు. ఒక పధకం ప్రకారమే ఇలా చెప్పించారని తెలుస్తోంది..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.