ఆర్యన్ ఖాన్ చిక్కిన క్రూయిజ్ షిప్ లో ..

    0
    1855

    అవి అలలపై తేలియాడే ఇంద్రభవనాలు.. క్రూయిజ్ షిప్ లంటే వినోదాలకు , సరసాలకు , సల్లాపాలకు , విలాసాలకు , చివరకు డ్రగ్స్ సేవించేందుకు సురక్షిత స్వర్గలోకాలయ్యాయి.. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకొని , రేవ్ పార్టీలో హల్చల్ చేస్తుండగా , అతడితోపాటు మరికొందరు చిక్కిపోయారు. దీంతో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్న కార్డియాల క్రూయిజ్ షిప్ పై ఇప్పుడు చర్చ మొదలైంది.

    దేశంలోని అత్యంత విలువైన , పెద్దదయిన క్రూయిజ్ షిప్ లలో కార్డియాల టాప్ రేంజ్ షిప్.. ఫైవ్ స్టార్ సౌకర్యాలు ఉంటాయి. లోపలే రెస్టారెంట్లు , బార్లు , డాన్స్ బార్లు , ఇండోర్ గేమ్స్ , గదులు , డైనింగ్ హాల్స్ , ఒకటేమిటి కార్డియాల క్రూయిజ్ షిప్ అంటే ఇంద్రభవనమే..

    ఒకరకంగా మయసభను తలపించే మాయాలోకమే.. దానిలోకి ఎంట్రీకి 17 వేల రూపాయల టికెట్ కొనాలి.. ఇది కేవలం ఎంట్రీకి మాత్రమే.. బయటకు వచ్చేప్పటికి రోజుకి కనీసం 70 వేల రూపాయలకు పైగానే అవుతుంది.

    దేశంలో క్రూయిజ్ షిప్ లలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ కార్డియాల క్రూయిజ్ షిప్ ప్రముఖమైనది. అన్నీ అలలపైనే జరిగిపోతాయి..

    అందుకే సినిమా సెలెబ్రిటీలు , వారి పిల్లలు , శృంగార పురుషులు .. క్రూయిజ్ షిప్ లలో కాసేపు విహారానికి లక్షలు వ్యయం చేస్తారు. ఇటీవల క్రూయిజ్ షిప్ లలో విందు , వినోదాలు , విలాసాలకు డిమాండ్ పెరగడంతో దేశంలో గత ఐదేళ్ళలో క్రూయిజ్ షిప్ ల సంఖ్య రెండింతలు అయింది.. ఇప్పుడు 138 క్రూయిజ్ షిప్ లు ఉన్నాయి.

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.