లక్నో చీటింగ్ గర్ల్ పోలీసులపైనే రివర్స్ .

  0
  483

  క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసిన లక్నో యువతి ప్రియదర్శిని వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్న నేపథ్యంలో తప్పంతా ఆమెదేననే వాదన బలపడుతోంది. తాను రోడ్డు దాటుతుండగా క్యాబ్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ తో తనను ఢీకొట్టబోయాడనేది ఆమె కంప్లయింట్. అందుకే తాను క్యాబ్ డ్రైవర్ పై చేయి చేసుకోవాల్సి వచ్చిందని ఆమె చెబుతోంది. లక్నో ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కూడా ఈ కేసుని జాగ్రత్తగా డీల్ చేయబోయారు. ఆడపిల్ల కంప్లయింట్ ఇవ్వడంతో ముందూ వెనకా చూడకుండా క్యాబ్ డ్రైవర్ సిద్ధిఖీని పట్టుకుని లోపలేశారు. అతడికి ఒకరోజంతా అన్నం పెట్టలేదట. అంతే కాదు క్యాబ్ డ్రైవర్ చెప్పేది వింటే అసలు దోషి ఆ అమ్మాయే అనే అనుమానం రాకమానదు. రోడ్డుకి అడ్డంగా వస్తున్న ఆ అమ్మాయిని చూసి డ్రైవర్ సిద్ధిఖీ జీబ్రా లైన్స్ ముందే కారు ఆపేశాడట. అయితే అంతలోనే ఆ యువతి ఓవర్ యాక్షన్ మొదలు పెట్టింది. క్యాబ్ డ్రైవర్ నుంచి ఫోన్ లాగేసుకుని దాన్ని విసిరి కొట్టింది. కారు సైడ్ అద్దాలను పగలగొట్టింది. క్యాబ్ డ్రైవర్ జేబులోనుంచి 600 రూపాయలు కొట్టేసింది. ఆమె అంత చేసినా, ఆడపిల్ల కావడంతో పోలీసులు ఈజీగా ఆమె మాటలు నమ్మేసి తనను లోపలేశారని వాపోతున్నాడు సిద్దిఖీ.

  సీసీ కెమెరా ఫుటేజీతో అసలు నిజం..
  ప్రియదర్శిని నానా హంగామా చేయడంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ తీసుకున్నారు. దీంట్లో అసలు నిజం బయటపడింది. ఆ యువతి కావాలనే రోడ్డుపై అడ్డదిడ్డంగా నడిచిందని సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టమైంది. తప్పంతా తనవద్ద పెట్టుకుని క్యాబ్ డ్రైవర్ చెంప పగలగొట్టడం అన్యాయమని తేలింది. దీంతో సోషల్ మీడియాలో ‘అరెస్ట్ లక్నో గర్ల్’ అనే ఉద్యమం మొదలైంది. దీంతో పోలీసులు కూడా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కథ అక్కడితో ఆగలేదు. ఆ యువతి పోలీసులపైకి రివర్స్ అయింది. పోలీసులు తన కుటుంబ సభ్యుల్ని వేధించారని, తన ఫోన్ నెంబర్ తీసుకున్నారని చెబుతోంది ప్రియదర్శిని. ఆత్మరక్షణకోసం క్యాబ్ డ్రైవర్ పై చేయి చేసుకున్నానని అంటోంది.

  ఈ వ్యవహారం అంతా చూశాక ప్రియదర్శిని అనే ఆ యువతి దేశముదురు అని తేలిపోయింది. సోషల్ మీడియాలో కూడా లక్నోగర్ల్ కి వ్యతిరేకంగా పోస్ట్ లు పడుతున్నాయి. క్యాబ్ డ్రైవర్ ని అకారణంగా కొట్టడం, పోలీసులపైనే రివర్స్ తిరగడంతో ఆమె వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.