బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈ రాత్రికి వాయుగుండం

  0
  821

  బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మార‌నుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డిన వాయుగుండం… క్ర‌మంగా ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. రాగ‌ల 48 గంట‌ల్లో ఇది మ‌రింత బ‌ల‌ప‌డ‌నుంద‌ని తెలుస్తోంది. వాయుగుండం ప్రభావంతో శ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ తీర ప్రాంతాల్లో విస్తారంగా వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంది. కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయ‌ని స‌మాచారం. తీరం వెంట గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక‌లు జారీ చేసింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.