కరోనా లైంగిక సామర్థ్యంపై దెబ్బ కొట్టింది.

    0
    673

    క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత దాడి చేసే వ్యాధుల్లో మ‌రో సంచ‌ల‌న‌మైన విష‌యం ప‌రిశోధ‌న‌ల్లో బ‌య‌ట‌ప‌డింది. క‌రోనా నుంచి కోలువ‌కున్న వారిలో ముఖ్యంగా పురుషుల్లో 20 శాతం మందిలో లైంగ‌క సామ‌ర్ధ్యం లోపించింద‌ని తేలింది. క‌రోనా కార‌ణంగా ర‌క్త‌క‌ణాలకు ఇన్ఫెక్ష‌న్ కు సోక‌డం, వాటిలో ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా త‌గ్గిపోయి శ‌రీర‌మంతా ర‌క్త‌స‌ర‌ఫ‌రా మంద‌గించేట్లు చేయ‌డం వ‌ల్ల పురుషుల్లో లైంగిక సామ‌ర్ధ్యంపై దీని ప్ర‌భావం ప‌డింద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. లైంగిక ప్ర‌క్రియ‌లో చిన్న పెద్ద న‌రాల గుండా ర‌క్తం ప్ర‌వ‌హించ‌గ‌లిగితేనే దాని నుంచి జ‌న‌నాంగాల‌కు ర‌క్తం స‌ర‌ఫ‌రా అయ్యి లైంగిక సామ‌ర్ధ్యం క‌లుగుతుంది. క‌ణాలు దెబ్బ‌తిని అక్క‌డ‌క్క‌డా ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌లో అడ్డంకులు ఏర్ప‌డిన‌ప్పుడు ఇది లైంగిక సామ‌ర్ధ్యంపై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపిస్తుంద‌న్నారు.

    క‌రోనా నుంచి కోలుకున్న అనేక మంది యూరాల‌జిస్టులు, సెక్సాల‌జిస్టులు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నార‌ని బ్రిట‌న్ లోని క్లీవ్ ల్యాండ్ చీఫ్ రియాన్ బెర్గ్ లెండ్ అన్నారు. క‌రోనా త‌ర్వాత వ‌చ్చే రోగాల్లో గుండె కండ‌రాలు దెబ్బ‌తిన‌డం విష‌యం తెలిసిందే. ఇప్పుడు దీని ప్ర‌భావం లైంగిక సామ‌ర్ధ్యంపై ఉంద‌ని కూడా తేలింది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా డేటా తెప్పించి విశ్లేషిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలో, క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత శ‌రీరంలో త‌క్కువ ఆక్సీజ‌న్ నిల్వ‌ల కార‌ణంగా లైంగిక సామ‌ర్ధ్యానికి, లైంగిక వాంఛ‌కు కార‌ణ‌మైన టెస్టో స్టెరాన్ ఉత్ప‌త్తిపై ప్ర‌భావం చూపించాయ‌ని కూడా తేలింది. క‌రోనా స‌మ‌యంలో వాస‌న కోల్పోవ‌డం కూడా లైంగికసామ‌ర్ధ్యంపై ప్ర‌భావం చూపించే మ‌రో కార‌ణం అని కూడా చెబుతున్నారు.

    తీవ్ర‌మైన క‌రోనా వ్యాధి నుంచి బ‌య‌ట‌ప‌డిన 30 నుంచి 40 ఏళ్ళ వ‌య‌సున్న వారిపై ప‌రిశోధ‌న‌లు చేస్తే వారిలో 40 శాతం మంది లైంగిక సామ‌ర్ధ్యంతో బాధ ప‌డుతున్న‌ట్లు తెలిసింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి లైంగిక సామ‌ర్ధ్యం లోపం అనిపిస్తే వారికి గుండె జ‌బ్బు కూడా ఉంద‌ని అనుమానించాల్సి వుంద‌ని యూనివ‌ర్శిటీ ఆఫ్ రోమ్ టోర్ వెర్గ‌టా ఎండోక్రైనాల‌జీ మ‌రియు మెడిక‌ల్ సెక్సాల‌జీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ ఇమ్మానియ‌ల్ జెనిన్ అన్నారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.