కియారా అద్వానీకి నెటిజన్ల చీవాట్లు…

  0
  245

  అందాల తార కియారా అద్వానీ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇటీవల సిద్ధార్థ మల్హోత్రా ఇంటికి వచ్చిన కియారా, కారులోనుంచి దిగేటప్పుడు ఓ ముసలాయన కారు డోరు తీశాడు. అయితే ఆమె కనీసం డోరు తీసిన పెద్దాయనకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా అలాగే వెళ్లిపోయింది. కారు తీసిన పెద్దాయన కియారాకు నమస్కారం చెప్పినా కూడా ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కియారాకు చీవాట్లు పడుతున్నాయి.

   

  View this post on Instagram

   

  A post shared by Manav Manglani (@manav.manglani)

   

  `భరత్ అనే నేను` లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించిన కియారా ఆ తర్వాత వినయ విధేయ రామా లాంటి డిజాస్టర్ ఎదురవ్వడంతో తీవ్రంగా నిరాశపడింది. టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవ్వాలని ఆశించింది గానీ.. ఆరంభమే పెద్ద దెబ్బ తగిలింది. దాంతో ఆశలు ఫలించలేదు. దీంతో పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టి సారించింది. ప్రస్తుతం హిందీ పరిశ్రమలోనే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రెండేళ్లుగా ముంబైలోనే ఉంటూ హిందీ ఇండస్ట్రీలోనే టాప్ పొజిషన్ పై కన్నేసింది. ప్రస్తుతానికి కియరా బాలీవుడ్ కెరీర్ ఆశించిన రేంజులోనే ఉంది.

  ఇదే సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రాతో పీకల్లోతూ ప్రేమలో కూడా మునిగినట్లు బాలీవుడ్ మీడియా వేడెక్కించేస్తోంది. వాటికి తగ్గ ఆధారలు కూడా బయటకొచ్చాయి. ఇరువురు సన్నిహితంగా ఉన్న ఫోటోలు….విదేశీ టూర్ల కు సంబంధించిన ప్రూఫ్ లతో ఇంకొంత క్లారిటీ దొరికింది. అయితే తాజాగా కియారా కారుదిగిన వీడియో బయటకు రావడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

   

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.