ఎక్కువ మైలేజీ రావాలంటే.. ఈ టిప్స్ పాటించండి..

    0
    2085

    పెట్రోలు రేటు సెంచరీ దాటి పరుగులు పెడుతోంది. ఈ దశలో పెట్రోలు వాడకాన్ని ఎవరూ తగ్గించలేరు కానీ, కనీసం మైలేజీని పెంచుకోవడంపై దృష్టిపెడితే.. ఆ భారం కాస్త తగ్గుతుంది. ఇప్పటి వరకూ మీ బైక్ ని ఎలా వాడినా పర్వాలేదు, ఇకపై మాత్రం కాస్త జాగ్రత్తగా వాడితే కండిషన్లో ఉండి మైలేజీ పెరుగుతుంది. దీనికోసం ఈ కింది టిప్స్ పాటించండి చాలు.

    బైక్ కొనుగోలు చేసే సమయంలో లీటర్ కి 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీలు చెబుతున్నా అది వాస్తవం కాదు. చాలా బైక్ ​లు లీటర్​ కు కనీసం 40 కిలోమీటర్ల మైలేజీని కూడా ఇవ్వవు. పట్టణాల్లో ట్రాఫిక్ జామ్ లో అది మరింత దిగజారిపోతుంది. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలి. మైలేజీని ఎలా పెంచుకోవాలి.

    – ఇంజిన్ ఆయిల్ తరచూ చెక్ చేసుకోవాలి. మంచి బ్రాండెడ్​ ఇంజిన్ ఆయిల్​ నే వాడాలి. మార్కెట్​ లో తక్కువ ధరకే లభిస్తుందని నాణ్యత లేని వాటిని వాడితే అది మీ బైక్ ఇంజిన్​ పాడైపోతుంది జాగ్రత్త.
    – చాలా మంది బిజీ వర్క్​లో పడి రెగ్యులర్ సర్వీసింగ్ ని మరచిపోతుంటారు. బైక్​లో ఏదైనా సమస్య తలెత్తితే తప్ప సర్వీసింగ్ చేయించరు. అలా కాకుండా రెగ్యులర్​గా సర్వీసింగ్​ చేయించాలి.
    – స్పీడ్ లిమిట్ తప్పనిసరి. పరిమిత వేగంతో వెళ్తేనే బైక్ అయినా, కార్ అయినా మంచి మైలేజీ ఇస్తాయి. ఎకానమీ లిమిట్ ఇచ్చిన మేరకు స్పీడ్ లిమిట్ లో వెళ్లాలి. ఓవర్ స్పీడ్ తో వెళ్తే మంచి మైలేజీ రాదు.
    – రెగ్యులర్​ సర్వీసింగ్​ చేయిస్తున్నప్పటికీ బైక్​ సరైన మైలేజీ ఇవ్వకపోతే.. కార్బురేటర్​ సెట్టింగ్స్​ చెక్​ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కార్బురేటర్ పనితీరును గమనిస్తూ రీ ట్యూనింగ్​ చేయించాలి.
    – టైర్లలో సరైన పరిమాణంలో గాలి ఉండేలా చూసుకోవాలి. లాంగ్​ రైడ్ ​లకు వెళ్తున్నప్పుడు, దూర ప్రయాణాలు చేసేముందు టైర్​ ప్రెజర్ ​ను గమనించాలి.
    – బైక్ విడిభాగాలు పాడైపోతే కచ్చితంగా కంపెనీ భాగాలనే అమర్చాలి. డూప్లికేట్ కంపెనీల పార్ట్ లు వాడితే మాత్రం మైలేజీపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
    – ట్రాఫిక్​ సిగ్నల్స్​ వద్ద ఎక్కువ సేపు వేచి ఉండాల్సి అవసరం వచ్చినప్పుడు ఇంజిన్ ఆపేసి ఉంచాలి. తద్వారా మైలేజీ పెరుగుతుంది. 30 సెకన్ల కంటే ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వచ్చినప్పుడు ఇంజిన్​ ఆపేయడమే మంచిది.
    – బైక్​ను కూడా ఎక్కువ సేపు ఎండలో పార్క్​ చేస్తే.. పెట్రోల్​, డీజిల్ లాంటి ఇంధనాలు ఆవిరైపోతాయి. తద్వారా, ఇంజిన్​ కెపాసిటీతో పాటు మైలేజీ తగ్గే అవకాశం ఉంది. అందుకని వీలైనంత వరకు బైక్ ను నీడలోనే పార్క్ చేయాలి.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.