ఫేస్ బుక్ డౌన్ టైం కి , ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లింక్ ఏమిటి..?

    0
    291

    కాసేపు ఫేస్ బుక్ , వాట్సాప్ ఆగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం ఎంతో తెలుసా..? పొద్దుపోక చూసే పేస్ బుక్ కి , ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధం ఏమిటని అనుకోవద్దు. ఒక్క పేస్ బుక్ షేర్ మార్కెట్ లోనే 5. 5 శాతం ట్రేడింగ్ పడిపోయి , గంటల్లోనే 1193 కోట్లు నష్టం వాటిల్లింది. ఇదికాక ప్రకటనలు, ఇంటర్నెట్ రంగాలకు మరో 1790 కోట్లు నష్టం వాటిల్లింది. దీనిబట్టి రోజూ 200 కోట్లమంది కస్టమర్లు తలదూర్చే ఫేస్ బుక్ బిజినెస్ ఎంతో మీరే ఊహించుకోండి.. ఫేస్ బుక్ పనిచేయడం మానేసింది సాయంత్రం 4 గంటల సమయం నుంచే.. బ్రిటన్ తో సహా పలు యూరప్ దేశాలు సాయంత్రం నుంచే ఫిర్యాదులు మొదలుపెట్టారు. మన దేశంలో మాత్రం రాత్రి 8 గంటల నుంచే ఫేస్ బుక్ మొరాయించడం మొదలుపెట్టింది. డౌన్ టైం మెయింటేనెన్స్ కింద ఇలా జరిగిందని కొందరంటే , మరికొందరు పేస్ బుక్ కమ్యూనిటీ రూల్స్ , అకౌంట్ వెరిఫికేషన్ లో కోట్లాది పేజీలు తొలగించడంలో సర్వర్లలో జాం కారణంగా ఇలా జరిగిందని చెప్పారు. ఫేస్ బుక్ మాత్రం అంతరాయానికి చింతిస్తున్నామని ఒక్క మాట చెప్పేసి మౌనంగానే ఉండిపోయింది..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.