బ్యాన్ ఎత్తేస్తున్నారా..?

  0
  108

  టిక్ టాక్ యాప్ పై నిషేధాన్ని అమెరికా ఎత్తివేయబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా మొదటి దశ ప్రబలిన వెంటనే చైనాకు వ్యతిరేకంగా అమెరికా తీసుకున్న అనేక నిర్ణయాలను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పునః సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా టిక్ టాక్ యాప్ పై నిషేషం తొలగించే దిశగా ఆలోచిస్తున్నట్టు వైట్ హౌస్ వర్గాలు ధృవీకరించాయి. టిక్ టాక్ యాప్ తోపాటు.. వుయ్ ఛాట్ తదితర యాప్ లలో భద్రతాపరమైన అంశాలను వాణిజ్య విభాగం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రైవసీ, సెక్యురిటీకి సంబంధించిన విషయాలపై వాణిజ్య విభాగం నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. భారత్ కూడా టిక్ టాక్ పై బ్యాన్ విధించింది. ఈ విషయంపై ఇంకా మనదేశ ప్రభుత్వం మాత్రం పునరాలోచించలేదు.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..