ఈ రాశులవారికి గ్రహణ ప్రభావం మహా డేంజర్..

  0
  163

  జ్యేష్ఠ మాసంలో ఏర్పడ్డ నేటి సూర్య గ్రహణం వివిధ రాశులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రముఖ జ్యోతిష్యులు వివరాలు వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం ఒంటిగంట 42 నిమిషాలకు మొదలై 4గంటల 11 నిమిషాలకు దీని ప్రభావం ఉంటుంది. 6 గంటల 41 నిమిషాలకు గ్రహణం ముగిసిపోతుంది. ఈశాన్య భారతంలో కొద్దిగా గ్రహణం ప్రభావం కనిపించే అవకాశం ఉన్నా.. సూదకం నిబంధనలు దీనికి అన్వయించవని పండితులు చెప్పారు. అయితే ఈ గ్రహణ ప్రభావం వివిధ రాశులపై ఇలా ఉండబోతోంది.

  మేషం – కుటుంబంలో కొన్ని విషయాల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ధనం విషయంలో జాగ్రత్త, మాటల్లో నిగ్రహం అవసరం. పనిచేసే ప్రదేశంలో వైఫల్యాలు గౌరవానికి భంగం కలిగే అవకాశం.

  వృషభం – ఈ రాశివారికి ఆత్మవిశ్వాస లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడతారు. మానసిక ఒత్తిడితోపాటు, ఆరోగ్యసంబంధమైన సమస్యలు వస్తాయి. మరికొద్దిరోజులపాటు కొత్తగా చేయబోయే ఏ ప్రాజెక్ట్ అయినా వాయిదా వేసుకోవడం మంచిది.

  మిథునం – ఈ రాశివారిపై సూర్య గ్రహణ ప్రభావ ప్రతికూల ప్రభావాలు తెచ్చిపెడుతుంది. ధన నష్టం, వ్యర్థ పనులకై ధన వ్యయం చేస్తారు. కుట్రకు బలవుతారు. వ్యతిరేకులతో మాట్లాడకుండా, వారితో వాదనకు దిగకుండా ఉండటం మంచిది. స్పీడ్ డ్రైవింగ్ మంచిది కాదు. గుంపులుగా ఉన్న ప్రాంతాలకు పోకుండా ఉండటం మంచిది.

  కర్నాకటం – కర్కాటక రాశులవారికి సూర్య గ్రహణ ప్రభావం మేలు చేస్తుంది. బదిలీలు ఆశిస్తున్నవారి ఆశలు నెరవేరతాయి. సంపాదనకు కొత్త మార్గాలు ఏర్పాటు చేసుకుంటారు. రావాల్సిన ధనం అందుతుంది. సంతాన ప్రాప్తికి ఇది సరైన సమయం. పెళ్లిల్లు, విద్యార్థులకు ఉన్నత విద్యలకు అవకాశం, సింహరాశి వారికి కూడా సూర్యగ్రహణ ప్రభావం మంచి చేస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లకు అవకాసం ఉంటుంది. పనిచేసే ప్రదేశంలో గౌరవం, ఆర్థికపరమైన ప్రయోజనం చేకూరతాయి. ఉన్నత స్థాయిలో ఉన్నవారి మెప్పు పొందుతారు. వ్యాపారస్తులకు మంచి కాలం.

  కన్య- ఈ రాశివారికి సూర్యగ్రహణ ప్రభావం చెడు చేస్తుంది. చేపట్టిన పనుల్లో గట్టిగా కృషిచేయాల్సి ఉంటుంది. స్నేహితులతో, బంధువులతో వాదన మంచిది కాదు. కుటుంబంలో కలహాలు వస్తాయి. ఆధ్యాత్మికతవైపు దృష్టిమళ్లించడం మంచిది.

  తుల- సూర్యగ్రహణ ప్రభావం ఈ రాశివారికి కూడా మంచిది కాదు. చేస్తున్న పనుల్లో ఆటంకం, అనవసరమైన వాదోపవాదాలకు పోకూడదు. వ్యతిరేకులనుంచి ప్రతికూలత తప్పదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

  వృశ్చికం – ఈ రాశివారికి వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు. భాగస్వాములతో విభేదం. కుటుంబంలో కలహాలు. దీనివల్ల వైవాహిక సంబంధాల్లో ఇబ్బందులు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి.

  ధనుస్సు – సూర్యగ్రహణ ప్రభావం ధనుస్సు రాశివారికి మంచిది. ఉద్యోగ ప్రమోషన్లకు సానుకూలం. శత్రువులపై విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. పాతకాలం నుంచి వేధిస్తున్న జబ్బులు నయం అవుతాయి. మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది.

  మకరం – మకర రాశివారికి సూర్య గ్రహణ ప్రభావం మంచిది కాదు. జూదం లాంటి వ్యసనాలు మానుకోవాలి. కొత్తగా ఏ పనులూ చేపట్టకూడదు. మానసికమైన ఆందోళన కొనసాగుతుంది. భాగస్వాములతో ఆస్తి వ్యవహారాల్లో డాక్యుమెంట్లపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉన్నతాధికారులతో విభేదాలు రావచ్చు.

  కుంభం – కుంభ రాశివారికి సూర్యగ్రహణ ప్రభావం మిశ్రమ ఫలితాలిస్తుంది. ప్రస్తుతం చేపట్టిన పనుల్లో అసహనం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పెట్టుబడుల్లో నష్టం రావొచ్చు. కుటుంబంలో కలహాలు ఉండొచ్చు.

  మీనం – సూర్యగ్రహణ ప్రభావం మీనరాశివారికి మంచి చేస్తుంది. చేస్తున్న పనుల్లో సత్ఫలితాలిస్తుంది. వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..