ఒలింపిక్స్ లో కండోమ్స్ గిఫ్ట్ఎందుకో తెలుసా.?

  0
  7921

  ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొనే క్రీడాకారుల‌కు జ‌పాన్ ప్ర‌భుత్వం ఓ బ‌హుమ‌తి ఇవ్వ‌నుంది. ఆ బ‌హుమ‌తి ఏమిటో తెలిస్తే నిజంగా మ‌న‌కి పిచ్చెక్కిపోతుంది. అయితే ఆ బ‌హుమ‌తిలో ఓ మంచి అర్దం, ప‌ర‌మార్ధం ఉంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే నెల‌లో టోక్యో ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఇందులో 11వేల మంది క్రీడాకారులు పాల్గొన‌బోతున్నారు. వారంద‌రికీ జ‌పాన్ ప్ర‌భుత్వం టోక్యోలో విమానం దిగిన వెంట‌నే ఓ బ‌హుమ‌తి ఇవ్వ‌బోతోంది. అదేమిటంటే, ఒక్కొక్క‌రికీ 14 కండోమ్స్ గిఫ్ట్ గా ఇస్తారు. ఈ లెక్క‌న ఒక ల‌క్ష 60వేల కండోమ్స్ త‌యారు చేయించారు. అయితే ఒలింపిక్స్ అయిపోయిన వెంట‌నే ఆ కండోమ్స్ ని వాళ్ళు గౌర‌వంగా తిరిగి ఇచ్చేసి విమానం ఎక్కాలి. లేదా చూపించి త‌మ‌తో తీసుకెళ్ళిపోవ‌చ్చు.

  ఈ కండోమ్స్ ని క్రీడాకారుల‌కు వాడుకునేందుకు తాము ఇవ్వ‌డం లేద‌ని ఒలింపిక్ క‌మిటీ చెప్పింది. వాటిని మ‌ళ్ళీ తీసుకెళ్ళి త‌మ దేశాల్లో చూపించ‌డ‌మో.. త‌మ‌కు ఇచ్చి వెళ్ళ‌డ‌మో చేయాల‌ని కోరింది. ఎయిడ్స్ మీద ఒక అవగాహ‌న క‌ల్పించేందుకు ఇలా చేస్తున్నామ‌ని అక్క‌డి అధికారులు చెబుతున్నారు. రెండోది.. క‌రోనా స‌మ‌యంలో సామాజిక దూరం పాటించాల‌ని ముఖ‌ప‌రిచయం లేని ఆడ‌, మ‌గ క‌లుసుకోకుండా క‌రోనాపై ఒక సందేశం ఇవ్వాల‌నే ఉద్దేశం కూడా ఆలోచ‌న‌గా చెప్పారు. ఒలింపిక్ గేమ్స్ విలేజ్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేందుకు ఎవ‌రికీ అనుమ‌తి లేద‌ని, ఉల్లంఘిస్తే ఫైన్ వేస్తామ‌ని హెచ్చ‌రించారు. జ‌పాన్ లో వ్య‌భిచారం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా జ‌రుగుతోంది. టోక్యోలోని అనేక ప్రాంతాల్లో రెడ్ లైట్ ఏరియాలు, ల‌వ్ హోట‌ల్స్, హోస్టెస్ క్ల‌బ్బులు, నైట్ క్ల‌బ్బులు వీట‌న్నింటికీ షింజుకీ మ‌రియు క‌బ్బుకి ప్ర‌సిద్ది. అందువ‌ల్ల ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొనేందుకు వ‌చ్చేవారు వేశ్యా వాటిక‌ల మీద ప‌డ‌కుండా ఈ ఏర్పాటు చేశారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..