ఎట్టకేలకు అసెంబ్లీ బరిలో కుష్బూ..

  0
  88

  సినీ నటి కుష్బూ కల ఎట్టకేలకు నెరవేరింది. పదేళ్ల కాలంలో ముచ్చటగా మూడు పార్టీలు మారిన కుష్పూ.. చివరకి చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగబోతోంది. పొత్తులో భాగంగా ఆ సీటుని బీజేపీకి కేటాయించింది అన్నాడీఎంకే. దీంతో తమ అభ్యర్థిగా కమలదళం అక్కడ కుష్బూని రంగంలోకి దించింది. అయితే అక్కడ సిటింగ్ ఎమ్మెల్యేగా కె.కె.సెల్వం డీఎంకే తరపున బరిలో ఉన్నారు. డీఎంకేకి అది కలిసొచ్చే నియోజకవర్గం కూడా. అయితే ఈ సారి అన్నాడీఎంకే, బీజేపీ రెండు పార్టీల బలాలు కలిసి కుష్బూకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు విశ్లేషకులు.

  పదేళ్ల కల…

  కుష్బూ గత పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. అప్పటినుంచి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగాలని వేచి చూస్తూనే ఉన్నారు. ఆమె ప్రస్థానం డీఎంకేతో మొదలైంది. కరుణానిధి పిలుపు మేరకు ఆమె డీఎంకేలో చేరారు. ఆ తర్వాతి కాలంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కూడా ఇమడలేకపోయారు. తాజాగా ఆమె బీజేపీలో చేరారు. ఇన్నాళ్లకు బీజేపీ ఆమె కల నెరవేరుస్తోంది. చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం తరపున కమలం గుర్తుపై కుష్బూ పోటీ చేయబోతోంది.

  తనకు టికెట్ దక్కడంపై కుష్బూ సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయబోమనని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు. అక్కడ కష్టపడి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

  https://twitter.com/khushsundar/status/1371038527513710594?s=20

  ఇవీ చదవండి…

  అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

  ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??