భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  0
  1319

  నెలరోజుల క్రితం భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చి పెట్టిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వనస్థలి పురంలో ఈ ఘోరం జరిగింది. నౌసీన్ బేగం అనే ఓ మహిళ గగన్ అగర్వాల్ ను రెండో పెళ్లి చేసుకుంది. ఆమెకి కూడా ఇది రెండో పెళ్లే. అయితే గత నెల 8వతేదీనుంచి గగన్ కనిపించడంలేదు. తన భర్త కనిపించడం లేదని నౌసీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గగన్ తమ్ముడు కూడా ఫిర్యాదు చేశాడు.

  పోలీసులకు ఫిర్యాదు.. ఇంటికి తాళం..

  పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత నౌసీన్ బేగం ఇంటికి తాళం వేసి, పాతబస్తీలోని తన పుట్టింటికి వెళ్లింది. వనస్థలి పురం ఇంట్లోనే నౌసీన్ బేగం భర్తను దారుణంగా నరికి చంపి, పూడ్చి పెట్టింది. గగన్ అదృశ్యం విషయంలో నౌసీన్ ను బుధవారం ఉదయం విచారించిన పోలీసులకు ఆమె సమాధానాలపై అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించడంతో భర్తను తానే చంపేసి ఇంట్లో పూడ్చేశానని చెప్పింది. అయితే ఇందుకు ఆమెకు సహకరించిన వాళ్లు, ఆమె హత్య చేసేందుకు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం కు పంపించారు. ప్రస్తుతం నౌసీన్ పోలీసుల అదుపులో ఉంది.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..