గుంటూరు జిల్లాలో కరోనాతో స్కూల్ మూసివేత..

    0
    653

    దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ, ఏపీలో కూడా రోజు వారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రోజువారీ సగటు కేసుల సంఖ్య పెరుగుతోంది. గుంటూరు జిల్లాలో నెలరోజులుగా కరోనా కేసుల సంఖ్య 10కిలోపే ఉంటోంది. అయితే ఆదివారం ఒక్కసారిగా కేసుల సంఖ్య 48కి పెరిగింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

    పొన్నూరు పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్ లో 8మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ఆ 8మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను హోమ్ క్వారంటైన్ కి పరిమితం చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. స్కూల్ ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. స్కూల్ కి తాళం వేసి శానిటైజ్ చేస్తున్నారు. వీరితోపాటు పట్టణంలోని మరో ముగ్గురికి కూడా పాజిటివ్ వచ్చింది.

    గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆరుగురు ఉద్యోగులు కోవిడ్‌ బారిన పడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా సోకినవారంతా ఈ నెల 10న మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో పనిచేశారు. దీంతో వారితో కలసి పనిచేసినవారి ఆరోగ్య పరిస్థితిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.

    ఏపీలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, మరణాల సంఖ్య తక్కువగా ఉండటంతో.. గతంలో ఏపీ ప్రభుత్వం ధైర్యం చేసి స్కూల్స్ ఓపెన్ చేసింది. ఇప్పుడు విద్యార్థులకు కరోనా రావడంతో స్కూల్స్ భవితవ్యంపై అనుమానాలు నెలకొన్నాయి.

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??