ఓటు వేస్కో.. వాషింగ్ మిషన్ తీస్కో..

    0
    311

    ఓటుకి నోటిస్తే అది నేరం, కానీ ఓటు వేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ నోట్లు లేదా, అంతకు మించి ఇంకేదిచ్చినా అది నేరం కాదు. తమిళనాడులో రాజకీయ పార్టీలు ముందుగానే ఇలా ఓటర్లతో బేరం కుదుర్చుకుంటున్నాయి. డీఎంకే మేనిఫెస్టోని మించి ప్రజలకు వరాలిచ్చింది అన్నాడీఎంకే. గతంలో జయలలిత అమ్మ గ్రైండర్ల పేరుతో ఆకట్టుకోగా, ఈసారి అన్నాడీఎంకే అధినేతలు వాషింగ్ మిషన్లిస్తామంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. అక్కడితో ఆగలేదు.. ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కూడా వాగ్దానం చేశారు. ప్రస్తుతం ఈ హామీలతో తమిళ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

    163 హామీలతో అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది..
    అందులోని ముఖ్యాంశాలు ఇవీ..
    – అందరికీ ఇళ్లు, మహిళల కోసం అమ్మ ఇంటి దీపం పథకం, మహిళలకు ప్రయాణ చార్జీల్లో రాయితీ, – ఉచిత వాషింగ్‌ మెషన్, సౌర శక్తి స్టౌవ్‌లు, ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు, 2023– అమ్మ విజన్‌ అమలు,
    – ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు, కేబుల్‌ ప్రసారాలు, అమ్మ వివాహ కానుక పెంపుతో పాటు నవ దంపతులకు అన్ని రకాల వస్తువులతో ప్రత్యేక సారె.
    – రాష్ట్ర వ్యాప్తంగా సూపర్‌ స్పెషాలిటీ సేవలతో అమ్మ క్లినిక్‌ల విస్తరణ, క్యాన్సర్‌ చికిత్సకు ప్రాధాన్యత. ప్రసూతి సెలవులను 12 నెలలకు పొడిగింపు, మహిళా శివు సంరక్షణ నిధి పెంపు, మహిళ భద్రతకు అన్ని నగారాల్లోనూ గస్తీ వాహనం, పోలీసు యాప్, మహిళా స్వయం సహాయక బృందాలకు రుణాలు, అమ్మ బ్యాంకింగ్‌ కార్డుల పంపిణీ, ఇంటింటా దోమ తెరలు.
    – రుణాలు రద్దు, 2జీబీ ఉచిత డేటా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణా కేంద్రాల ఏర్పాటు. ఇంటికో ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తమిళులకు ప్రత్యేక ప్రాధాన్యతకు చర్యలు. పట్టణాలు, నగరాల్లో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల ఏర్పాటు.
    – వృద్ధాప్య ఫించన్లు రూ. 1000 నుంచి రూ. 2 వేలకు పెంపు. ప్రత్యేక ప్రతిభావంతులకు రూ. 1,500 నుంచి రూ. 2500 పెంపు.
    – జాతీయ అధికార భాషగా తమిళం. మద్రాసు హైకోర్టును తమిళనాడు హైకోర్టుగా మార్చడం, తమిళంలోనే వాదనలకు అనుమతి. తమిళాభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రవాస తమిళుల కోసం ప్రత్యేక విభాగం, ఈలం తమిళుల సంక్షేమం, జంట పౌరసత్వం, రాజీవ్‌ హంతుకుల విడుదల.
    – వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, కొనుగోలు, విక్రయ కేంద్రాలు, అరటి నారతో వస్త్రాల తయారీకి పెద్ద పీట, కొబ్బరి మొక్కల పంపిణీ, గిడ్డంగుల విస్తరణ, సౌర శక్తి మోటారు పంపు సెట్ల రాయితీ కొనసాగింపు. వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు, నమ్మల్వార్‌ పేరిట వ్యవసాయ పరిశోధన కేంద్రం, సీఎం – రైతు బంధు పథకం,
    – దక్షిణ తమిళనాడులో అంతర్జాతీయ ప్రమాణాలతో బఫెల్లో పార్క్‌.
    – పెట్రోల్‌, డీజిల్‌ ధర తగ్గింపుకి చర్యలు. 150 రోజులకు ఉపాధి పథకం పొడిగింపు.
    – అమ్మగ్రీన్‌ హౌస్‌ నిర్మాణ సాయం రూ. 3.40 లక్షలకు పెంపు, సంక్రాంతి కానుక కొనసాగింపు. నెలసరి విద్యుత్‌చార్జీల వసూళ్లు,
    – 9,10,11,12 తరగతి విద్యార్థులకు పౌష్టికాహార పథకం. అంగన్‌వాడీ పిల్లలకు పాలు, ఆటో డ్రైవర్లకు ఎంజీఆర్‌ గ్రీన్‌ ఆటో పథకం పేరిట రూ. 25 వేలు సాయం. దశల వారిగా మద్యం దుకాణాల మూత, సహకార రుణాలకు వడ్డీ రద్దు. ఆధ్యాత్మిక పర్యటనలకు ప్రభుత్వ సాయం పెంపు. శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణ.
    – ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు రాయితీపై మోటర్ సైకిళ్ల పంపిణీ..

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??