ఆన్ లైన్ లో సెల్ ఫోన్ బుక్ చేస్తే కొన్ని సార్లు సబ్బులు, రాళ్లు, ఇంకేదో బరువైన వస్తువులు రావడం పరిపాటి. కంపెనీల పేరుతో కొంతమంది డెలివరీ బాయ్స్ ఇలా మోసం చేసిన సందర్భాలున్నాయి. ఫేక్ కంపెనీలు కూడా ఇలా వినియోగదారుల్ని మోసం చేసిన ఉదాహరణలున్నాయి.
అయితే ఇక్కడో కేటుగాటు.. ఏకంగా ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు. బెంగళూరులో బనశంకరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మోసగాడి ఉదంతం బయటపడింది. 28ఏళ్ల ఉమీర్ మొహ్మద్ తరచూ ఆన్ లైన్ లో సెల్ ఫోన్లు ఆర్డర్ ఇస్తాడు. డెలివరీ బాయ్ సెల్ ఫోన్ తెచ్చిస్తే దాన్ని తీసుకుని, డబ్బులు తెస్తానంటూ ఇంట్లోకి వెళ్తాడు. తీరా ఇంట్లోనుంచి వట్టి చేతుల్తో బయటకొచ్చి, డబ్బులు లేవని, పేరెంట్స్ వద్దన్నారని కబుర్లు చెబుతాడు. బాక్స్ రిటర్న్ చేస్తాడు.
అయితే అలా రిటర్న్ చేసే సమయంలోనే మనోడి తెలివి చూపిస్తాడు. ఇంట్లోకి తీసుకెళ్లి అందులోని సెల్ ఫోన్ తీసేసి, ఖాళీ బాక్స్ లో చిన్న సబ్బు ముక్క పెట్టి తిరిగిచ్చేసేవాడు. మనోడికి ఓ పార్సిల్ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉండటంతో.. జాగ్రత్తగా పార్సిల్ చేసి తిరిగి వారికి ఇచ్చేసేవాడు. తీరా వాటిని డెలివరీ బాయ్స్ కంపెనీకి తిరిగి పంపించేసిన తర్వాత అసలు విషయం బయటపడేది. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా పదే పదే జరగడంతో.. అమెజాన్ కంపెనీ ఎంక్వయిరీ పెట్టింది. అయితే ఉమీర్ అహ్మద్, ఒకే అడ్రస్ నుంచి, ఒకే ఫోన్ నెంబర్ తో ఇలా ఆర్డర్లు ఇచ్చేవాడు కాదు. పదే పదే అడ్రస్ లు, మొబైల్ నెంబర్లు మార్చేవాడు. అయినా ఎట్టకేలకు అతడ్ని పట్టుకుని చీటింక్ కేసు పెట్టారు. ఒక్క అమెజాన్ కంపెనీనుంచే అతడు లక్షా 20వేల రూపాయల విలువైన సెల్ ఫోన్లను ఇలా కొట్టేశాడని కనిపెట్టారు పోలీసులు. ఇలా కొట్టేసిన ఫోన్లను సెకండ్ హ్యండ్ లో అమ్మసేవాడు. చివరకు ఇలా పోలీసులకు చిక్కాడు.
ఇవీ చదవండి:
భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..
ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??
ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..