సమంత.. ప్రీతమ్.. మధ్యలో కేటీఆర్..

  0
  861

  నాగచైతన్య, సమంత విడాకుల వ్య‌వ‌హారం ఇప్పుడు సినిమా ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్. విడాకుల‌కు చాలా కార‌ణాలు ఉన్నాయని, అందులో స‌మంత ప‌ర్స‌న‌ల్ స్టైలీష్ట్ ప్రీత‌మ్ జుక‌ల్క‌ర్ కూడా ఒక‌ర‌ని.. అత‌డితో స‌మంత స్నేహంగా ఉండ‌డం.. పైగా స‌మంత బ‌ర్త్ డే రోజు త‌న కాళ్లు అత‌డి ఒళ్లో పెట్టుకుని ప‌డుకున్న ఫొటోలు పోస్ట్ చేయ‌డంతో ర‌క‌ర‌కాల సందేహాలు వ‌స్తున్నాయి. విడాకులపై ఇద్దరూ అధికారికంగా ప్రకటించాక ఆ సందేహాలు మ‌రింత ఎక్కువ అయ్యాయి.

  అస‌లు ఈ ప్రీత‌మ్ ఎవ‌రు ? స‌మంత‌కు ఎలా ? ప‌రిచ‌యం అంటూ ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. ఇత‌డిది హైద‌రాబాద్‌. వ‌య‌సు 33. ఫ్యాన్ డిజైనింగ్‌పై ఆస‌క్తితో ఫ్యాషన్ అండ్ టెక్స్ టైల్స్‌‌లో డిగ్రీ చేశాడు. త‌ల్లి బ‌ట్టలు కుట్టేవారు. దీంతో ప్రీత‌మ్ కూడా అదే మిష‌న్‌పై బ‌ట్ట‌లు కుట్టే క్ర‌మంలోనే ఫ్యాష‌న్‌పై ఆస‌క్తి పెంచుకున్నాడు.

  డిజైనింగ్‌లో డిగ్రీ పూర్త‌య్యాక భార‌తీయ సాంప్ర‌దాయం ఉట్టిప‌డేలా కొన్ని డిజైన్స్ చేశాడు. స‌మంత‌కు చేనేత వ‌స్త్రాలు అంటే ఆస‌క్తి ఎక్కువ‌. ఈ క్ర‌మంలోనే ఆమె చేనేత వ‌స్త్రాల‌ను ప్రోత్స‌హించే కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ చేప‌ట్టిన ఓ కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తు ఇచ్చింది. అక్క‌డే ప్రీతమ్ జుకల్కర్‌‌కి సమంతతో పరిచయం ఏర్పడింది. చివ‌ర‌కు వారిద్ద‌రు చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు.

  అయితే ప్రీత‌మ్ కేవ‌లం స‌మంత‌కే కాదు.. ర‌కుల్‌, రాశీఖ‌న్నాకు కూడా స్టైలీష్ట్‌గా ఉన్నాడు. స‌మంత బ‌య‌ట ప‌లు షోల‌కు వెళ్లిన‌ప్పుడు స‌మంత‌కు ఎన్నో డిజైన్లు త‌యారు చేసి ఇచ్చాడు. వీటి వ‌ల్ల అత‌డికి మంచి పేరు రావ‌డంతో పాటు డిమాండ్ కూడా ఏర్ప‌డింది.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.