బంగాళా ఖాతంలో నెలకొన్న అల్పపీడన ప్రభావంతో ఈ నెలలో మన రాష్ట్రానికి భారీ వర్షాలు సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు దఫాలు తుఫానులు తీరాన్ని తాకే అవకాశంతో , ఈ నెల 22 వరకు అప్పుడప్పుడు భారీ వర్షాలు వచ్చే సూచనలున్నాయి. 14,లేదా 15 తేదీలలో , ఆ తరువాత 21 తేదీ ఇప్పటికే ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రెండు తుఫానుల కారణంగా భారీ వర్షాల సూచన ఉందన్నారు. కోస్తా , రాయలసీమ , ఉత్తరాంధ్ర జిల్లాలలో ఈ ప్రభావం ఉండొచ్చునని అన్నారు. మంగళవారం నాడు రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిశాయి. కామవరపుకోటలో 56.3 , విజయవాడలో 56, అనంతగిరిలో 54 , సత్తెనపల్లిలో 49. 5, గుంతకల్ లో 47, అద్దంకిలో 44. 5, తడలో 66, నెల్లూరులో 60, తిరుమలలో 105 మిల్లీమీటర్ల వర్షం పడింది..