మదర్సా టీచర్లకు పెన్షన్లు ఎందుకు..?

  0
  19

  మదర్సా టీచర్లకు కేరళ ప్రభుత్వం పెన్షన్లు ఎందుకు ఇస్తోందంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. మతపరమైన ప్రచారం చేసే మదర్సాలలో పనిచేసే టీచర్లకు ప్రభుత్వం తరపున పెన్షన్లు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని అడిగింది.సివిల్ ఆర్గనైజేషన్ ఫర్ డెమొక్రసీ అనే సంస్థ కార్యదర్శి మనోజ్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వంపా ప్రశ్నల వర్షం కురిపించింది.

  కేరళ మదర్సా టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ -2019కి ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సాయంపై సమాధానం చెప్పాలని కోరింది.కేవలం మత పరమైన బోధన చేసే టీచర్లకు ప్రభుత్వం తరపున పెన్షన్లు ఎలా ఇస్తారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇలాంటి మత సంస్థల్లో పనిచేసేవారికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం రాజ్యాంగబద్ధం కాదని ఆయన చెప్పారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..