కొవిడ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్..

  0
  24

  కరోనా కాలంలో అందరికీ కొత్తగా పరిచయమైంది శానిటైజర్. ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండే ఈ ద్రావణాన్ని చేతులకు రాసుకుంటే వ్యాధికారక సూక్ష్మ క్రిములు వెంటనే చనిపోతాయి. పదే పదే చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకోవడానికి బదులు శానిటైజర్ వాడుతుంటారు. అయితే శానిటైజర్ ని ఎలా వాడాలో గ్రామాల్లో ఇంకా చాలామందికి తెలియదు. అలాంటి ఓ వ్యక్తి చేతిలో శానిటైజర్ పోస్తే ఏం చేశాడో మీరే చూడండి.

  చేతుల్లో శానిటైజర్ పోస్తే.. దాన్ని రెండు అరచేతులకు రాసుకోవడమే కాకుండా.. మొత్తం ఒళ్లంతా రుద్దుకున్నాడు. మోచేతులకు పూసుకుని శుభ్రం చేసుకున్నాడు. ఆ తర్వాత తలకు కూడా పట్టించాడు, అక్కడితో ఆగకుండా మోహానికి కూడా పూసుకున్నాడు. ఆఖరున కాళ్లు, అరికాళ్లకు కూడా చేతుల్లోని శానిటైజర్ ని రుద్దేశాడు.

  శానిటైజర్ ని విచిత్రంగా వాడిన ఆ వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మందు దొరక్కపోతే శానిటైజర్ తాగేవారి గురించి విన్నాం కానీ.. ఇలా చేతిలో శానిటైజర్ పోస్తే.. దాంతో ఒళ్లంతా రుద్దుకుని, దాదాపుగా స్నానం చేసినంత పనిచేసే వ్యక్తిని ఇప్పుడే చూస్తున్నామంటూ ఆ వీడియోకి కామెంట్లు వస్తున్నాయి. సోషల్ మీడియా అతనికి మ్యాన్ ఆఫ్ ది కరోనా ఇయర్ అనే బిరుదు ఇచ్చేసింది. ఇకపై శానిటైజర్ కంపెనీలు కూడా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం అతడి వీడియో ఉపయోగించుకుంటాయేమోనని ట్రోల్ చేస్తున్నారు మరికొంతమంది.

  మొత్తమ్మీద శానిటైజర్ ని ఇలా కూడా వాడొచ్చు అని నిరూపించిన ఆ ముసలాయన.. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..