బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ మ‌ళ్ళీ క‌ల‌క‌లం రేపుతోంది..

    0
    36

    బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ మ‌ళ్ళీ క‌ల‌క‌లం రేపుతోంది. 13 ఏళ్ళ త‌ర్వాత మొట్ట‌మొద‌టి సారిగా చైనాలోని జియాంగ్ సూ అనే ప్రాంతంలోని 41 ఏళ్ళ వ్య‌క్తికి బ‌ర్డ్ ఫ్లూ సోకింది. దీంతో అత‌న్ని గ‌త నెల‌లోనే అత్య‌వ‌స‌రంగా ఆస్ప‌త్రిలో ఉంచి చికిత్స చేశారు. దాదాపు నెల రోజుల త‌ర్వాత ఆ వ్య‌క్తికి H7N9 బ‌ర్డ్ ఫ్లూ సోకింద‌ని ప్ర‌క‌టించారు. 2008-13 మ‌ధ్య బ‌ర్డ్ ఫ్లూ సోకి 460 మంది చ‌నిపోయారు. H7N9 బ‌ర్డ్ ఫ్లూ చాలా అరుదుగా మ‌నుషుల‌కు సోకుతుంది. కోళ్ళు, కొన్ని ప‌క్షులు, నీటి ప‌క్ష‌లు ఈ బ‌ర్డ్ ఫ్లూ సోక‌డానికి కార‌ణాలు.

    బ‌ర్డ్ ఫ్లూ కార‌ణంగా ప‌క్షులే ఎక్కువ సంఖ్య‌లో చ‌నిపోతుంటాయి. మాన‌వుల‌కు సోకి పెద్ద‌గా ప్రాణ‌న‌ష్టం క‌లిగించిన సంఘ‌ట‌న‌లు లేవు. ఒక‌సారి ఒక మ‌నిషికి బ‌ర్డ్ ఫ్లూ సోకిన త‌ర్వాత అత‌ని నుంచి మ‌రొక‌రికి క‌రోనా వైర‌స్ మాదిరిగా సోకిన సంద‌ర్భాలు కూడా లేవు. అయితే ఒక‌వైపు క‌రోనా వైర‌స్ తో ప్ర‌పంచం పోరాడుతుంటే మ‌రోవైపు ఈ బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ ఓ వ్య‌క్తిలో క‌నిపించ‌డం ఇప్పుడు చైనాలో సంచ‌ల‌న‌మైంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విష‌యంపై దృష్టి సారించింది. ప్ర‌స్తుతానికి ఇది మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కు సోకుతుంద‌నేందుకు స‌రైన ఆధారాలు లేక‌పోయినా, దాని క‌ట్ట‌డికి ప్ర‌య‌త్నించాల‌ని సూచించింది.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..