కన్నడ టీవీ నటి సౌజన్య సుసైడ్ చేసుకుంది. జీవితం మీద విరక్తితో తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు ఆమె సుసైడ్ లెటర్ రాసి పెట్టి ఉంది. నాలుగు పేజీల ఈ లేఖలో తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, తనకు తానుగా ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొంది. తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలతో మానసికంగా బాధపడుతున్నాని తెలిపింది. ఐ లవ్ యు నాన్న … నన్ను క్షమించండి అంటూ చెప్పింది. తనకు సహాయసహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని తెలిపింది.
గత కొన్నిరోజులుగా తాను మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని, ఇండస్ట్రీలో పరిస్థితులు ఏమీ బాగోలేవని, ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య తప్ప తనకు మరో దారి తెలియడం లేదని లేఖలో వివరించింది. కన్నడ పలు టీవీ సీరియన్స్ లో నటించిన సౌజన్య పాపులర్ అయింది. ఒకట్రెండు సినిమాల్లోనూ ఆమె నటించింది. సౌజన్య మరణవార్తతో కన్నడ టీవీ, సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సుసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు.