భారత్ లో సింగిల్ డోస్ టీకాకు అనుమతి..

    0
    38

    భారత్ లో సింగిల్ డోస్ టీకాకు ప్రభుత్వం అత్యవసర అనుమతి ఇచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేసిన ఈ టీకా ఇకపై జనసామాన్యంలోకి రాబోతోంది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

    భారత్‌లో అత్యవసర వినియోగ అనుమతుల కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఈనెల 5న దరఖాస్తు చేసుకుంది. రోజుల వ్యవధిలోనే దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

    ప్రస్తుతం దేశంలో కొవాక్సిన్, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వి టీకాలు అందుబాటులో ఉండగా ఇటీవలే అమెరికాకు చెందిన మోడెర్నా టీకా కూడా ఆ లిస్ట్ లో చేరింది. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టీకాకు కూడా ఆమోదం లభించింది. మిగతావన్నీ రెండు డోసుల టీకాలు కాగా.. జాన్సన్ కంపెనీది సింగిల్ డోస్ టీకా.

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..