ఆవేశం మధ్య జనసేన రాష్ట్ర కమిటీ సమావేశం..

  0
  146

  బూతుపురాణాలు , తిట్లు , శాపనార్థాల మధ్య రగిలిపోతున్న జనసేన కార్యకర్తల ఆవేశం మధ్య జనసేన రాష్ట్ర కమిటీ సమావేశం బుదవారం ఉదయం 10 గంటలకు విజయవాడలో మొదలుకానుంది. రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో , పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు , కులంపై చేసిన వ్యాఖ్యలు , జగన్ ని ఉద్దేశించి చేసిన విమర్శలు , ప్రభుత్వపనితీరుపై చురకలు , పేర్ని నానిని పేరుపెట్టకుండా సన్నాసి ..అంటూ తిట్టడం , ఆతరువాత పేర్ని నాని పవన్ ని అంతకంటే మించి తిట్టడం , ఒరే , కొడకా , శుంఠ అని తిట్టిపోయడం తెలిసిందే. తరువాత జనసేన , పీకే ఫాన్స్ సోషల్ మీడియాలో పేర్ని నానిని ఆడుకున్నారు. అనంతరం పోసాని ప్రెస్ మీట్ , ఆ తరువాత పోసాని ఇంట్లో మహిళలపై పవన్ ఫాన్స్ అసభ్యంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో వాతావరణం హీటెక్కి , పవన్ కళ్యాణ్ గత జీవితాన్ని , పవన్ ఇంట్లో ఆడవాళ్ళని , పవన్ శీల హీనుడని పోసాని చెప్పలేనంత బూతులతో తిట్టిపోశారు. పోసానిపై పవన్ ఫాన్స్ దాడి ప్రయత్నం కూడా జరిగింది. ఇంతగా వేడెక్కిన వాతావరణంలో జనసేన రాష్ట్ర కమిటీ బుధవారం సమావేశం కానుంది.. పేరుకు పెద్ద ఎజెండా ఉన్నా , పవన్ కళ్యాణ్ సినీ , రాజకీయ జీవితంలో గత 4 రోజుల పాటు చేసిన ఆరోపణలు గతంలో ఎప్పుడూలేదు . అందువల్ల సమావేశం ఈ ఆరోపణ , ప్రత్యరోపణలపైనే చర్చించనుందని చెబుతన్నారు. మెగా కుటుంబానికి ఈ స్థాయిలో షాక్ తగిలిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు.. అందువల్ల దీన్ని ఇంతటితో వదిలేస్తారా లేక చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారా అన్నది చూడాల్సిఉంది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.