18 వేల కిలోల అణుబాంబు పేలితే..ఊహించ‌గ‌ల‌రా ?

    0
    12193

    ఒక కిలో బాంబు పేలితే, ఎంత భీభ‌త్సం జ‌రుగుతుందో అంద‌రికీ తెలిసిందే. అలాంటిది 18 వేల కిలోల అణుబాంబు పేలితే.. ఇంకెలా ఉంటుంది. ఊహించ‌గ‌ల‌రా ? ఊహ‌కంద‌ని విష‌య‌మే మ‌రి. కానీ అన్ని వేల కిలోల పెద్ద బాంబు పేలింది. కానీ నేల‌పై కాదు… న‌డి స‌ముద్రంలో. ఈ ప్ర‌యోగానికి తెర తీసింది అమెరికా నావికా ద‌ళం. యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ (సీవీఎన్78) నౌక పై నుంచి అట్లాంటిక్ మహా సముద్రంలో తొలి పేలుడు పరీక్షను నిర్వహించింది. 40 వేల పౌండ్ల (సుమారు 18,143 కిలోలు) బరువున్న బాంబును సముద్రం అడుగు భాగాన పేల్చింది.ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్ లో భాగంగా కొత్త నౌకలు బాంబు పేలుళ్ల ధాటికి ఎలా తట్టుకుంటాయో తెలుసుకునేందుకు, వాటి యుద్ధ సన్నద్ధతను బేరీజు వేసుకునేందుకు ఈ పరీక్షను నిర్వహించింది. జలచరాలు, పర్యావరణానికి ఎలాంటి నష్టం లేకుండానే అమెరికా తూర్పు తీరంలో ఈ పరీక్ష చేసినట్టు అమెరికా నౌకాదళం ప్రకటించింది. అయితే, పేలుడు ధాటికి సముద్రం నీళ్లు అల్లంతెత్తుకు ఎగిసిపడ్డాయి. దాని తరంగాలు చాలా దూరం వరకు విస్తరించాయి.

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..