కాఫీ తాగండి.. లివర్ కాపాడుకోండి..

  0
  260

  కాఫీ తాగడం అన్ని విధాల శ్రేయస్కరం అని, లివర్ జబ్బుకి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని, శాస్త్రవేత్తల విస్తృత పరిశోధనలో తేల్చారు. గతంలో కూడా చాలా పరిశోధనల్లో కాఫీ, ఆరోగ్యానికి మంచిదేనని చెప్పారు. తాజాగా యూనివర్శిటీ ఆఫ్ సౌత్ హాంప్టన్ జరిపిన పరిశోధనల్లో లివర్ జబ్బు రాకుండా, లివర్ వ్యాధి వచ్చినా అది ముదిరి ప్రాణాంతకం కాకుండా కాఫీ కాపాడుతుందని చెప్పారు. కాఫీలో కవేల్, కెఫెస్టాల్.. అనేవి కాలేయానికి రక్షణగా నిలుస్తాయని కెఫైన్ కాలేయంపై దాడి చేసే హానికర వైరస్, బ్యాక్టీరియాలపై పోరాడుతుందని చెప్పారు. కాఫీ సేవనంతో వృద్ధాప్యంలో వచ్చే లివర్ జబ్బులు రానీయకుండా ఒక రక్షణగా నిలుస్తుందని కూడా తెలిపారు.

  మద్యం, ఊబకాయం.. కారణంగా వచ్చే లివర్ వ్యాధులు తీవ్రం కాకుండా కాఫీ 49శాతం మందిని కాపాడిందని, కాఫీ తాగనివారికంటే, తాగినవారిలోనే లివర్ జబ్బుల్ని ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని చెప్పారు. 4,96,000 మందిపై ఈ పరిశోధన చేశారు. 40నుంచి 69ఏళ్ల వయసు మధ్య వ్యక్తుల్ని పరీక్షించారు. రోజుకి 2 కప్పుల కాఫీ తీసుకుంటే లివర్ కే కాదు, మెదడు కూడా చురుగ్గా ఉంటుందని, వార్థక్యంలో వచ్చే అల్జీమర్స్ వ్యాధిని ఇది సమర్థంగా నిరోధిస్తుందని, ఈ పరిశోధనలో పేర్కొన్నారు. అయితే 2 కప్పులకు మించి కాఫీ తీసుకుంటే మంచిది కాదని కూడా చెప్పారు. మందయినా సరే మితంగానే వాడాలన్నారు. అతిగా వాడితే దానివల్ల ఇబ్బందులు కూడా తలెత్తుతాయని గుర్తుంచుకోవాలని అన్నారు. అందువల్ల 2 కప్పుల కాఫీయే లివర్ సంరక్షణకు దివ్యౌషధం అని తేల్చారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..