మొటిమలు రాకుండా ‘ఉమ్మి’ పూసుకుంటా..

  0
  429

  చిన్నప్పుడు ఎక్కడైనా ఆటల్లో దెబ్బ తగిలినా, రక్తం వస్తున్నా.. వెంటనే ఉమ్మి తీసి అక్కడ పూసేస్తాం. ఉమ్మి(సలైవా)లో యాంటీబయోటిక్స్ ఉంటాయి, అందుకే అప్రయత్నంగా మనం దాన్ని పూసుకుంటాం. అయితే మొటిమలకు కూడా ఉమ్మి ట్రీట్ మెంట్ వాడొచ్చని చెబుతోంది ప్రముఖ హీరోయిన్ తమన్నా. అవును, తన మొహంపై మొటిమలు వస్తే తాను సలైవా అప్లై చేస్తానని వెంటనే తగ్గిపోతాయని చెప్పింది.

  వినడానికి కాస్త షాకింగ్‌గానే ఉంది. కానీ ఈ మాట తానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది తమన్నా.
  ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్కిన్‌ కేర్‌ ఐటమ్స్‌లో మార్నింగ్ సలైవాను కూడా వాడుతానని చెప్పింది. ఉదయాన్నే లేచిన తర్వాత తన లాలాజాలం(సలైవా)ను అప్లై చేస్తానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. అంతేకాదు సలైవా స్కిన్ ప్రాబ్లెమ్స్ క్లియర్ చేయడంలో బాగా పని చేస్తుందని తెలిపింది.

  ప్రస్తుతం ఎఫ్-3, మ్యాస్ట్రో సినిమాల్లో నటిస్తున్న తమన్నా, పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. సినిమా అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మిల్కీ బ్యూటీ.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..