ఆ సాలెపురుగు విషం, గుండె జబ్బు రోగులకు వరం.

    0
    37

    ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన విషం క‌లిగిన సాలీడు పురుగు, ఇప్పుడు గుండె జ‌బ్బుతో బాధ ప‌డే రోగుల‌కు ప్రాణం పోయ‌బోతోంది. ప్ర‌పంచంలోనే అత్యంత విష‌పూరిత‌మైన ఫ‌న్న‌ల్ వెబ్ స్పైడ‌ర్ నుంచి గుండె వ్యాధుల‌కు ఇంజెక్ష‌న్లు త‌యారు చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు గుండె జ‌బ్బుల‌తో బాధ ప‌డే వారికి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేస్తున్నారు. ప్ర‌యోగ‌శాల‌లో జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో ఇది విజ‌య‌వంతంగా ప‌ని చేస్తోంద‌ని తేలింది. హ‌ర్ట్ ఎటాక్ వ‌చ్చిన త‌ర్వాత ఈ సాలీడు నుంచి విషం నుంచి అభివృద్ది చేసిన ఇంజెక్ష‌న్ వేస్తే బాగా ప‌ని చేసింద‌ని క్వీన్స్ ల్యాండ్ శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

     

    హార్ట్ ఎటాక్ వ‌చ్చిన త‌ర్వాత గుండెకు ర‌క్త ప్ర‌సారం త‌గ్గిపోతుంది. త‌ద్వారా ఆక్సీజ‌న్ కూడా మంద‌గిస్తుంది. దీంతో గుండె కండ‌రాలు దెబ్బ‌తింటాయి. ఆక్సీజ‌న్ త‌గ్గ‌డం వ‌ల్ల క‌ణాల వాతావ‌ర‌ణంలో ర‌సాయ‌నిక‌త పెరుగుతుంది. దీనివ‌ల్ల గుండెలోని క‌ణ‌జాలం చ‌నిపోతుంది. గ‌త ద‌శాబ్దాలుగా గుండె జ‌బ్బుల‌కు సంబంధించి ఎన్ని ఇంజెక్ష‌న్లు ఉన్నా, దెబ్బ‌తిన్న క‌ణ‌జాలాన్ని పున‌రుద్ద‌రించే మందులుగానీ, ఇంజెక్ష‌న్లు గానీ లేవు. అయితే ఫ‌న్న‌ల్ వెబ్ స్పైడ‌ర్ నుంచి తీసిన విషంలో ప్రోటీన్ ను వేరుచేసి, త‌యారు చేసిన ఇంజెక్ష‌న్ గుండె జ‌బ్బుల మీద స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేస్తోంద‌ని, గ‌తంలో ఉన్న వాటి కంటే ఇది దివ్య ఔష‌ధం అని పేర్కొన్నారు.

    ఈ విషంలోని హెచ్ఐవ‌న్ఏ ప్రోటీన్ గుండెలోని క‌ణ‌జాలం మృత‌ప్రాయం కాకుండా ర‌క్షిస్తుంది. ఇదే ఇప్పుడు గుండె జ‌బ్బు రోగుల‌కు ఆశాజ‌న‌కంగా ప‌ని చేస్తోంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. రాబోయే రెండు మూడేళ్ళ‌లో దీన్ని ఉప‌యోగంలోకి తీసుకొస్తామ‌ని పేర్కొన్నారు.

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..